Telugu News » Konda Vishweshwar Reddy : బీఆర్ఎస్ ఎంపీ-బీజేపీ నేత మధ్య వార్.. బంజారాహిల్స్ లో నమోదైన కేసు..!!

Konda Vishweshwar Reddy : బీఆర్ఎస్ ఎంపీ-బీజేపీ నేత మధ్య వార్.. బంజారాహిల్స్ లో నమోదైన కేసు..!!

మరోవైపు తన జీవితంలో ఎవరూ తనపై ఇలా మాట్లాడలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని, అందుకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాలని వారికి సూచించినట్లు తెలిపారు.

by Venu
bjp counter attack on brs leaders comments

చేవెళ్ల బీఆర్ఎస్ (BRS) ఎంపీ రంజిత్ రెడ్డిపై (Ranjith Reddy) కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ, బీజేపీ (BJP) నేత కొండా విశ్వేశ్వర రెడ్డిపై (Konda Visweswara Reddy) దుర్భాషలాడినట్లు అందిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ (Banjarahills) పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరించారని కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు.

bjp counter attack on brs leaders comments

ఈ నెల 17న ఫోన్ చేసిన రంజిత్ రెడ్డి.. అగౌరవంగా, అసభ్యకరంగా మాట్లాడారని విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ సంఘటనపై న్యాయ సలహా తీసుకొన్న పోలీసులు.. నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఈ కేసు విషయంలో మాట్లాడిన ఇన్ స్పెక్టర్ సతీష్.. ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు తన జీవితంలో ఎవరూ తనపై ఇలా మాట్లాడలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని, అందుకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాలని వారికి సూచించినట్లు తెలిపారు. రంజిత్ రెడ్డి ఫోన్‌ను సీజ్ చేసి రికార్డ్స్ పరిశీలించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. అయితే మరో 2 నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎంపీపై కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇకపోతే కొండా విశ్వేశ్వర రెడ్డి 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ తో విభేదాల కారణంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మూడేళ్లు హస్తం పార్టీలో కొనసాగిన విశ్వేశ్వర రెడ్డి, 2021లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు..

You may also like

Leave a Comment