Telugu News » KTR: కపట నీతికి మారుపేరు కాంగ్రెస్.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

KTR: కపట నీతికి మారుపేరు కాంగ్రెస్.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

by Mano
KTR: Congress is a nickname for hypocritical ethics.. KTR's tweet is viral..!

కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శించారు. ఆయన శుక్రవారం ఎక్స్(X) వేదికగా ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.

KTR: Congress is a nickname for hypocritical ethics.. KTR's tweet is viral..!

ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ.4వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అవేమీ ఇవ్వలేదని భట్టి మాట మార్చారంటూ ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.

వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోందని దుయ్యబట్టారు. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి నేడు టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2వేలకు (2 పేపర్లకు) పెంచిందని పేర్కొన్నారు.

అదేవిధంగా బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని, తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment