Telugu News » KTR : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!!

KTR : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!!

కేటీఆర్ నకిలీ ప్రచారం అని చెప్పుకునే బదులు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాసేవ చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతోన్నట్టు ట్వీట్ చేస్తున్నారు.. మరోవైపు ఈ నకిలీ ప్రచారం అనే ఫీడ్‌బ్యాక్ మీ బీఆర్ఎస్ కార్యకర్తల నుంచే వచ్చి ఉంటుంది కేటీఆర్ జీ అంటూ కొందరు కామెంట్స్ పెడుతోన్నారు..

by Venu

సోషల్ మీడియాలో యమా యాక్టివ్ పర్సన్ గా పేరుతెచ్చుకొన్న బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నిల తర్వాత తనకు చాలా ఆసక్తికరమైన ఫీడ్‌బ్యాక్, పరిశీలనలు వచ్చాయని పేర్కొన్న కేటీఆర్.. తెలంగాణలో కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి బదులు, 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఉంటే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేవాళ్లమని అన్నారు..

ప్రస్తుతం కేటీఆర్ (KTR) ట్వీట్ సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో కేసీఆర్‌ (KCR)కు మద్దతు పలుకుతూ నిజమే కేటీఆర్ జీ, మెడికల్ కాలేజీలతో పాటు యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఏర్పాటు చేయాల్సిందని ట్రోల్ చేస్తున్నారు.. మరికొందరేమో బీఆర్ఎస్ పార్టీ ఓటమి నుంచి ఏం నేర్చుకోలేదని మండిపడుతున్నారు.

కేటీఆర్ నకిలీ ప్రచారం అని చెప్పుకునే బదులు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాసేవ చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతోన్నట్టు ట్వీట్ చేస్తున్నారు.. మరోవైపు ఈ నకిలీ ప్రచారం అనే ఫీడ్‌బ్యాక్ మీ బీఆర్ఎస్ కార్యకర్తల నుంచే వచ్చి ఉంటుంది కేటీఆర్ జీ అంటూ కొందరు కామెంట్స్ పెడుతోన్నారు.. అయితే కేటీఆర్ మాత్రం.. తనకు ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లలో ఇదే ఉత్తమమైనదని పేర్కొన్నారు..

ఈ పరిశీలన కొంతవరకు ఏకీభవించేందిగా అనిపిస్తోందన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 10 సంవత్సరాల దొరల పాలనకి బ్రేక్ పడింది.. తొలిసారిగా ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మూడోసారి ముచ్చటగా అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న కేసీఆర్ ఆశ నిరాశ అయ్యింది.. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలలో ఇదివరకి ఉన్నంత జోష్ కనిపించడం లేదని అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment