Telugu News » KTR new look: కేటీఆర్‌ కొత్త లుక్.. నెట్టింట వైరల్‌..!

KTR new look: కేటీఆర్‌ కొత్త లుక్.. నెట్టింట వైరల్‌..!

ఈ కొత్త లుక్‌లో ఉన్న ఫొటోను కేటీఆరే స్వయంగా తన అధికారిక ఎక్స్‌(X) ఖాతాలో ట్వీట్‌ చేశారు. అయితే, అది ఆయన ఒరిజినల్‌ ఫొటో కాదు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపాడట.

by Mano
KTR new look: KTR's new look is going viral..!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) కొత్త లుక్‌(New look)లో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. హెయిర్ స్టయిల్‌ విషయంలో ఎప్పుడూ సింపుల్‌గా ఉండే కేటీఆర్ ఆ ఫొటోలో కాస్త భిన్నంగా కనిపిస్తున్నారు.

KTR new look: KTR's new look is going viral..!

ఈ కొత్త లుక్‌లో ఉన్న ఫొటోను కేటీఆరే స్వయంగా తన అధికారిక ఎక్స్‌(X) ఖాతాలో ట్వీట్‌ చేశారు. అయితే, అది ఆయన ఒరిజినల్‌ ఫొటో కాదు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ వీరాభిమాని కేటీఆర్‌ ఫొటోను పొడవాటి జట్టు, గడ్డంతో ఎడిట్‌ చేసి ఆయనకే పంపించాడట.

ఆ ఫొటో కింద ‘కేటీఆర్‌’ అని ఇంగ్లిష్‌లో పెద్ద అక్షరాలతో రాశారు. పేరు కింద ‘ది కమ్‌ బ్యాక్‌ ఈజ్‌ ఆల్వేస్‌ స్ట్రాంగర్‌ దేన్‌ ది సెట్‌ బ్యాక్‌’ అనే కొటేషన్‌ను జతచేశారు. ఫొటో పైభాగంలో ఎడమ పక్కన ‘Pink Ants Team USA’ అని ఉంది. ఆ ఫొటో బాగా నచ్చడంతో కేటీఆర్‌ దాన్ని షేర్‌ చేశారు.

‘బీఆర్‌ఎస్‌ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్‌ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్‌ చేస్తున్నా’ అంటూ కేటీఆర్ ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దాని కింద ‘నా జట్టు, గడ్డం నేనే ఇలా పెంచుకున్నా’ అని ఓ లైన్‌ రాశారు. దాన్ని నవ్వుతున్న ఎమోజీని ఆడ్‌ చేశారు. కేటీఆర్‌ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

You may also like

Leave a Comment