Telugu News » KTR : ప్రభుత్వానికి కేటీఆర్ రిక్వెస్ట్.. గుజరాత్‌కు తరలిపోకుండా చూడండి..!

KTR : ప్రభుత్వానికి కేటీఆర్ రిక్వెస్ట్.. గుజరాత్‌కు తరలిపోకుండా చూడండి..!

నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు.. తమ సమస్యలపై ఆవేధన వ్యక్తం చేస్తూ.. వీడియో రికార్డు చేసి కేసీఆర్ గారికి పంపాలని ఓ యువకున్ని కోరాడు.

by Venu

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. ప్రభుత్వ పాలనలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు విమర్శలు చేస్తూనే.. మరోవైపు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు కేన్స్ చిప్ యూనిట్ తరలిపోనున్నట్లు వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కర్ణాటక నుంచి తెలంగాణకు కేన్స్ చిప్ యూనిట్ సంస్థను తరలించేందుకు తాము ఎంతో శ్రమించామని తెలిపారు. ఈ సంస్థ కొంగరకలాన్‌, ఫాక్స్‌కాన్ ప్లాంట్ దగ్గర స్థలం కావాలని కోరింది.. అయినా కంపెనీ తరలిపోకుండా.. పది రోజుల్లో జాగా కేటాయించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ గుజరాత్‌కు తరలిపోతుందనే వార్త బాధ కలిగించిందని వెల్లడించారు. కాగా తెలంగాణలోనే ఈ సంస్థ ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి.. కేన్స్ ఓసాట్ యూనిట్ కీలక పాత్ర పోషించనుంది. మరోవైపు సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ రైతు భావోద్వేగమైన వీడియోపై కేటీఆర్ స్పందించారు. తానును త్వరలోనే ముషంపల్లి (Mushampally) గ్రామాన్ని సందర్శిస్తానని ట్వీట్ చేశారు. అదీగాక ఆ ఊరిలో మల్లయ్యని, బోర్ వెల్ రాంరెడ్డిని వ్యక్తిగతంగా కలుస్తానని వెల్లడించారు.

మరోవైపు నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు.. తమ సమస్యలపై ఆవేధన వ్యక్తం చేస్తూ.. వీడియో రికార్డు చేసి కేసీఆర్ గారికి పంపాలని ఓ యువకున్ని కోరాడు. దీంతో అతను ఆ రైతు ఆవేదనని వీడియోలో బంధించి ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అది వైరల్ గా మారడంతో ఆ వీడియోని కొందరు నెటిజన్లు కేటీఆర్ ని ట్యాగ్ చేసి షేర్ చేశారు..

You may also like

Leave a Comment