Telugu News » KTR : ఫిబ్రవరిలో బీఆర్ఎస్ కొత్త సినిమా.. కేసీఆర్ ఎంట్రీతో స్టార్ట్..!!

KTR : ఫిబ్రవరిలో బీఆర్ఎస్ కొత్త సినిమా.. కేసీఆర్ ఎంట్రీతో స్టార్ట్..!!

తాజాగా సినిమా స్టార్ట్ కావడం ఎన్నో రోజులు పట్టదు, ఫిబ్రవరి నుండే స్టార్ట్ అవుతుందని.. 5 యేండ్లు పాటు మనం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

by Venu
ktr-presentation-on-telangana-development

తెలంగాణ (Telangana)లో రాజకీయాలు కామెడీ స్కిట్ లా మారుతున్నాయని అనుకొంటున్నారు.. కాంగ్రెస్ (Congress).. బీఆర్ఎస్ (BRS) మధ్య జరుగుతోన్న ఆరోపణలను గమనిస్తున్న వారు.. అధికారం పోయిందనే బాధలో కేటీఆర్ (KTR) ఉన్నట్టు చర్చలు మొదలైయ్యాయి.. ఇప్పటికే పార్టీ ఓటమికి బాధ్యులు తాము కాదన్నట్టు ప్రవర్తిస్తోన్న కవిత (Kavitha).. కేటీఆర్ తీరుకు కొందరు నేతలు నొచ్చుకొంటున్నట్టు టాక్ వినిపిస్తోంది..

KTR: Give KCR another day's chance to take oath: KTR

ఈ క్రమంలో సినిమా ట్రైలర్ లా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం.. ఒక ప్రతిపక్ష పార్టీ ఎలా బిహేవ్ చేయాలో అలా బీఆర్ఎస్ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. అసలు కేటీఆర్ రాజకీయాల్లోకి రావడంతోనే పదవులు పొందడం వల్ల ఆయనకు ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో తెలియలేదని.. తండ్రి నీడలో రాజకీయాలు చేసిన ఆయన.. ఒక్కసారిగా అధికారం లేకపోయే సరికి తట్టుకోలేక పోతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడటం కనిపిస్తోంది..

తాజాగా సినిమా స్టార్ట్ కావడం ఎన్నో రోజులు పట్టదు, ఫిబ్రవరి నుండే స్టార్ట్ అవుతుందని.. 5 యేండ్లు పాటు మనం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. తెలంగాణ భవన్ లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్..10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే.. కళ్ళులేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుందని మండిపడ్డారు.

కేసీఆర్ (KCR) ప్రజా క్షేత్రంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి సినిమా స్టార్ట్ అవుతుందని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరంపై విచారణకు స్వాగతిస్తున్నమన్నారు. తప్పు తేలితే శిక్షకు సిద్దమని తెలిపారు. కాళేశ్వరంను పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర నుంచి నీటిని తీసుకురావాలన్న కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అనాలోచితమన్న పోచారం.. నీటి విడుదలపై తొందరగా నిర్ణయం తీసుకొని రైతులు పంట పండించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు..

You may also like

Leave a Comment