గుడివాడ నుంచి హైదరాబాద్ కు వచ్చి తన వంటలతో ఓ చిన్న ఫుడ్ స్టాల్ ను ఓపెన్ చేసుకుని నడుపుకుంటున్న కుమారి ఆంటీ గురించి హైదరాబాద్ మొత్తం తెలుసు. ఆమె పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె గత పదమూడేళ్లుగా ఇదే బిజినెస్ లో కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె చాలా ట్రెండింగ్ లో ఉన్నారు. మొదట్లో ఆమెకు ఐటిసి కోహినూర్ ఏరియాలో మాత్రమే పాపులారిటీ ఉండేది. అయితే.. ఆమె ఫుడ్ నచ్చడంతో ఎవరో ఆమె ఫుడ్ స్టాల్ గురించి వీడియో చేసారు. మీ బిల్ వెయ్యి రూపాయలు అయ్యింది. టు లివెర్స్ ఎక్స్ట్రా తిన్నారు కదా అని ఆమె అన్న మాటలు కూడా రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది.
ఈ క్రమంలో ఆమె గురించి పలు యూట్యూబ్ ఛానెల్స్ ఇంట్రెస్టింగ్ గా ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించాయి. ఈ ఇంటర్వ్యూ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ సందర్భంలో ఆమె ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఆమెకు ఇల్లు ఇచ్చారు అంటూ పేర్కొన్నారు. దీనితో వైసీపీ మీడియా ఈ వీడియో క్లిప్ ను తెగ షేర్ చేస్తూ ప్రచారం చేసుకోవడం ప్రారంభించింది.
ఆవిడ క్లియర్ గానే ఉంది…. వీళ్ళకే చాలా సస్పెన్స్ తరువాత అర్ధమయ్యింది…
ఇప్పుడు పేటీఎంలలో ముఖచిత్రాలు ఏంటో 🤣#KumariAunty pic.twitter.com/U7OtFEkG90
— KUPPAM—TDP (@KuppamTdp) January 31, 2024
ఆ తరువాత మరో వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ విలేఖరి ఆమెను తన ఫేవరెట్ రాజకీయ నాయకుడు ఎవరో చెప్పాలని కోరగా.. ఆమె తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడుకే ఓటు వేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. దీనితో ఈ వీడియోని కూడా టీడీపీ కార్య కర్తలు వైరల్ చేస్తూ వచ్చారు. అటు వైసీపీ కార్య కర్తలు, ఇటు టీడీపీ కార్య కర్తలు ఆమె వీడియోలను వైరల్ చేస్తూ ఆమెను కూడా క్యాంపెయినర్ గా మార్చేశారు. ప్రస్తుతం కుమారి ఆంటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.