Leo Review in Telugu: విజయ్ లియో కోసం ఆడియెన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పక్కా విజయ్ కి హిట్ అందిస్తుందని భావిస్తున్నారు కూడా. ఇక ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కూడా అయిపొయింది. ఈ సినిమాలో విజయ్, సంజయ్ దుత్త, త్రిష, అర్జున్ తదితరులు నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. S. S. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి లియో మూవీ ని నిర్మించారు. ఆనిరుధ్ రవిచందర్ లియో మూవీ కి సంగీతాన్ని అందించారు.
Also read:
చిత్రం : లియో
నటీనటులు : విజయ్, సంజయ్ దుత్త, త్రిష, అర్జున్ తదితరులు
నిర్మాత : S. S. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి
సంగీతం : ఆనిరుధ్ రవిచందర్
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
విడుదల తేదీ : అక్టోబర్ 19, 2023
లియో కథ మరియు వివరణ:
తాజాగా లియో మూవీ పై ఉదయనిధి స్టాలిన్ చెప్పినవి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అలానే ఉదయనిధి స్టాలిన్ లియో మూవీ చాలా బాగా వుంది అని కూడా అన్నారు. ఈ మూవీ కి యాక్షన్ కొరియోగ్రఫీ, అనిరుధ్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యాయని. ఇవి మూవీ ని వేరే లెవెల్ కి తీసికెళ్లాయన్నారు. విజయ్ యాక్టింగ్, యాక్షన్ సీన్లు ఉన్నాయని, అవి కూడా బాగున్నాయన్నారు. లియో సినిమా లో ట్విస్టులును కూడా బాగా పెట్టారట. ఇలా ఉదయనిధి స్టాలిన్ అనడంతో విజయ్ ఫ్యాన్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకా పెంచేసుకున్నారు.
మూవీ స్టోరీ చూస్తే.. పార్థు (విజయ్) కాశ్మీర్ లో ఒక చాక్లెట్ బేకరీని రన్ చేస్తూ ఫ్యామిలీ తో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. పార్థు మరియు అతని కుటుంబం మీద ఓ రోజు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తారు. ఇలా అవడం తో పార్థుకి అస్సలు ఏమీ అర్ధమే కాదు. పార్థు లానే లియో అని ఓ గ్యాంగ్స్టర్ ఉండేవాడట. అందుకే ఇలా జరుగుతుంది అని తెలుస్తుంది. మరి ఇద్దరూ ఒకరేనా..? దీని నుండి పార్థు ఎలా బయటపడతాడు…? ఆఖరికి ఏం అవుతుంది..? ఇవి తెలుసుకోవాలంటే సినిమా ని చూడండి. మూవీ లో LCU ని టచ్ చేస్తూ వుండే సన్నివేశాలు బావున్నాయి.
కాశ్మీర్ లో ప్రారంభం అయ్యి మూవీ కామన్ గానే వెళ్తుంది. కథ మొదలైనప్పటి నుంచి నెక్స్ట్ ఏమి అవుతుందనేది తెలిసిపోతూ ఉంటుంది. అయితే పార్థు మీద అటాక్ జరిగినప్పటి నుండీ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రొటీన్ గానే కథ ఉంటుంది. ఎక్కడో చూసాము కదా అనే ఫీలింగ్ ఉంటుంది. పార్థు పాత్రలో విజయ్ సూపర్ గా చేసాడు. త్రిష పాత్ర తక్కువే ఉంటుంది కానీ బానే ఆకట్టుకుంది. సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ కూడా సినిమాయే రేంజ్ ని పెంచారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా బానే వుంది.
ప్లస్ పాయింట్లు:
ఓ రేంజ్ లో ఉన్న ట్విస్ట్లు
అనిరుద్ అందించిన మ్యూజిక్
విజయ్ రోల్
మైనస్ పాయింట్లు:
రొటీన్ స్టోరీ
నెక్స్ట్ ఏమిటో అర్థమయ్యేలా కథ
రేటింగ్: 2.75/5