Telugu News » Loksabha Elections: ఏప్రిల్ 16న సార్వత్రిక ఎన్నికలు…. క్లారిటీ ఇచ్చిన చీఫ్ ఎలక్టోరల్ అధికారి…!

Loksabha Elections: ఏప్రిల్ 16న సార్వత్రిక ఎన్నికలు…. క్లారిటీ ఇచ్చిన చీఫ్ ఎలక్టోరల్ అధికారి…!

ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారీ జారీ చేసిన సర్క్యులర్ ఒకటి వైరల్ కావడంతో ఎన్నికల అంశంపై హాట్ చర్చ జరిగింది.

by Ramu
Lok Sabha Elections 2024 to be held on 16 April? Chief Electoral Officer says

దేశంలో లోక్ సభ (Loksabha) సార్వత్రిక ఎన్నికలు (Elections) ఏప్రిల్ 16 నుంచి నిర్వహిస్తారంటూ ఓ వార్త వైరల్ (Viral) అయింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారీ జారీ చేసిన సర్క్యులర్ ఒకటి వైరల్ కావడంతో ఎన్నికల అంశంపై హాట్ చర్చ జరిగింది. అటు రాజకీయ వర్గాలు, ఇటు సామాన్య జనం ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఇది కాస్త ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో దానిపై క్లారిటీ ఇచ్చింది.

Lok Sabha Elections 2024 to be held on 16 April? Chief Electoral Officer says

సర్క్యులర్‌లో వెల్లడించి తేదీల గురించి పలువురు మీడియా ప్రతినిధులు తమను ప్రశ్నిస్తున్నారని ఢిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి వెల్లడించారు. ఎన్నికలను ఓ ప్లానింగ్ ప్రకారం నిర్వహించేందుకు, పోలింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా కేవలం రెఫరెన్స్ కోసం ఆ తేదీని సర్క్యులర్ లో ప్రస్తావించామని వివరణ ఇచ్చారు. ఆ తేదీకి ఎన్నికలకు సంబంధం లేదన్నారు.

ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం పలు కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆ పనులన్నింటినీ గుర్తించాక, ఏదో ఒక రోజును ఎన్నికల తేదీగా ఊహించుకుని దాన్ని రెఫరెన్స్ తేదీగా ఇస్తామన్నారు. ఆ రిఫరెన్స్ తేదీ ఆధారంగా ఆయా పనులను ఏ రోజును ప్రారంభించి వాటిని ఏ తేదీలోగా పూర్తి చేయాలనే దానిపై తాము టార్గెట్ పెట్టుకుంటామని చెప్పారు. ఆ మేరకు ఏప్రిల్ 16ను తమ రెఫరెన్స్ కోసం అధికారులకు సూచించామన్నారు.

ఏప్రిల్ 16 లోపు ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా వర్గాలకు ఈ నెల 19న అధికారికంగా ఓ సర్క్యులర్ జారీ చేశామని వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. సరైన సమయంలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తారని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment