Telugu News » Nikki Haley | ‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ ఎన్నికల ప్రచారంలో భారత సంతతి మహిళకు వింత అనుభవం..!

Nikki Haley | ‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ ఎన్నికల ప్రచారంలో భారత సంతతి మహిళకు వింత అనుభవం..!

భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ (Nikki Haley)కి ఎన్నికల ప్రచారంలో వింత అనుభవం ఎదురైంది. న్యూ హాంప్‌షైర్‌లో ఆమె ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా మద్దతుదారు ఒకరూ ఊహించని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అంటూ బిగ్గరగా అరిచాడు.

by Mano
Nikki Haley | A woman of Indian descent has a strange experience during the election campaign of 'Will you marry me..?'

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ (Republican Party) అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ (Nikki Haley)కి ఎన్నికల ప్రచారంలో వింత అనుభవం ఎదురైంది. న్యూ హాంప్‌షైర్‌లో ఆమె ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా మద్దతుదారు ఒకరూ ఊహించని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అంటూ బిగ్గరగా అరిచాడు.

Nikki Haley | A woman of Indian descent has a strange experience during the election campaign of 'Will you marry me..?'

దీంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. ఈ అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న నిక్కీ హేలీ.. కాస్త తేరుకుని నవ్వుతూ స్పందించింది. ‘నాకు మద్దతుగా ఓటు వేస్తావా?’ అని అతడిని ప్రశ్నించింది. దాంతో కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్న అతడు ‘నేను ట్రంప్‌కు మద్దతుగా ఓటు వేయబోతున్నా’ అని చెప్పాడు. అతడి సమాధానంతో అసహనానికి గురైన నిక్కీ హేలీ.. ‘అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని చెప్పింది.

అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలో దిగాలని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు 52ఏళ్ల నిక్కీ హేలీ గట్టి పోటీదారుగా నిలిచింది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఇటీవల జరిగిన అయోవా రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో నిక్కీ హేలీకి 19 శాతం, ట్రంప్‌కు 51 శాతం, డిశాంటిస్‌కు 21 శాతం, మరో భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామికి 7.7 శాతం ఓట్లు వచ్చాయి.

ఈ క్రమంలో తొలుత వివేక్‌, తర్వాత డిశాంటిస్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొని ట్రంప్‌నకు మద్దతు పలికారు. దాంతో ట్రంప్‌, నిక్కీ హేలీ మధ్యే హోరాహోరీ పోరు జరగనుంది. భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ అజిత్‌ సింగ్‌, రాజ్‌ కౌర్‌ రణధావా దంపతులు 1960లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. వారికి 1972లో నిక్కీ జన్మించారు. గతంలో నిక్కీ సౌత్‌ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా రెండుసార్లు పనిచేశారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఐరాసలో ఆమె అమెరికా రాయబారిగా పనిచేశారు.

You may also like

Leave a Comment