Telugu News » Lok Sabha Elections : బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు ఖరారు.. కేసీఆర్ ఎన్ని సీట్లు కేటాయించారంటే..?

Lok Sabha Elections : బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు ఖరారు.. కేసీఆర్ ఎన్ని సీట్లు కేటాయించారంటే..?

బీఎస్పీ తో పొత్తువల్ల దళిత ఓట్లు పొందవచ్చనుకుంటే అది భ్రమే అవుతుందని అనుకొంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ పై గతంలో ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు మర్చి పోలేదని భావిస్తున్నారు.

by Venu
RSP

తెలంగాణ రాజకీయాలో ప్రస్తుతం నెలకొన్న ఒక అంశం చర్చాంశనీయంగా మారింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు.. దారిదాపుల్లోకి కూడా బీఎస్‌పీని రానియలేదనే ఆరోపణలున్నాయి. అయినా బహుజన సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar).. ప్రస్తుతం కారుతో పొత్తుకు సిద్దం అవడం కొత్త చర్చలకు దారితీసిందని అంటున్నారు..

అదీగాక ప్రవీణ్ కుమార్ మాత్రం కేసీఆర్ ని విపరీతంగా విమర్శిస్తూ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసిన విషయం తెలిసిందే.. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి కేసీఆర్ (KCR)తో చేతులు కలపడం కొందరికి మాత్రం జీర్ణం అవడం లేదనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఈ ఘటన నిరూపించిందంటున్నారు..

అయితే దీని పై కొందరు రాజకీయ నాయకులు విస్మయం వ్యక్తం చేయగా, మరికొందరు ఇది కేసీఆర్ లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు వల్ల బీఆర్ఎస్ (BRS)కి ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం ఉండదని టాక్ వినిపిస్తోంది. అదీగాక ఇప్పటికే బీఆర్ఎస్ పై దొరల పార్టీ అనే ముద్ర పడింది. ఇక బీఎస్పీ తో పొత్తువల్ల దళిత ఓట్లు పొందవచ్చనుకుంటే అది భ్రమే అవుతుందని అనుకొంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ పై గతంలో ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు మర్చి పోలేదని భావిస్తున్నారు.

అయితే ఇదంతా పట్టించుకొనే వారు రాజకీయాల్లో రాణించలేరని భావిస్తున్న నేతలు పొత్తులకు సిద్దం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే.. తాజాగా బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు ఖరారు అయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించింది. హైదరాబాద్‌ (Hyderabad), నాగర్ కర్నూలు (Nagar Kurnool) నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారని
తెలుస్తోంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువు లోక్ సభ ఎన్నికల్లో గెలిచి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మెుత్తం 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక వారం రోజుల క్రితమే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరగా.. సీట్ల షేరింగ్‌పై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్‌ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

You may also like

Leave a Comment