రాష్ట్రంలో తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్ (BRS).. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండుసార్లు వరుసగా సాధారణ ఎన్నికలలో అప్రతిహత విజయం సాధించి పదేళ్ళ పాటు తిరుగులేకుండా కొనసాగింది. పార్టీ అధినేత ఒక మహారాజులా రాష్ట్రాన్ని ఏలేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలను రాష్ట్ర ప్రజలు వాడిపోయేలా చేశారు..
విధి ఎంత విచిత్రం. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) అధికారం కోల్పోవడం.. అనంతరం వరుసగా వచ్చి పడుతున్న సమస్యలతో పాటు కుమార్తె కవిత (Kavitha)ను ఈడీ (ED) అరెస్టు చేయటం ఆయనను పూర్తి బలహీనుడిగా మార్చిందని అనుకొంటున్నారు.. ఇదే సమయంలో వరుసగా లీడర్లు కూడా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. దీంతో పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొందనే ప్రచారం మొదలైంది.
గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 40 సీట్లు గెలుచుకున్న పార్టీ ఎంతో గట్టిగా పోరాటం చేయాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఆ పరిస్థితిలో కనపడటం లేదని.. ల్ సభ ఎన్నికల సన్నాహాలను కేసీఆర్ (KCR) పూర్తిగా పక్కన పెట్టేసారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఎన్నికలు అయ్యేవరకు కేసీఆర్ బహిరంగంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని అనుకొంటున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న వారెవరూ.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress)కు గట్టి పోటీ ఇవ్వలేక పోతున్నారనే చర్చలు మొదలైయ్యాయి. అదేవిధంగా 16 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల్లో కేవలం హైదరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పదహారు మందిలో ఎంత మంది గట్టి పోటీ ఇచ్చే వారు అనే ప్రశ్నలు ఉదయిస్తే.. ఆ పార్టీ నేతలే తడబడే పరిస్థితి ఉందని అంటున్నారు..
ఒకప్పుడు బీఆర్ఎస్ తరపున కుక్కను నిలబెట్టిన గెలుస్తుందని చిన్న బాస్ ప్రకటించారు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ నాయకులు నిలబడినా గెలిచే సీన్ లేదని అంటున్నారు.. అందుకే వారంతా పోటీకి వెనుకడుగు వేయడం.. పార్టీ మారిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలను లైట్ తీసుకోన్న కేసీఆర్.. బరిలో నిలిచే నేతలకు ముందుగానే ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవద్దని చెప్పినట్లు లీకులు వినిపిస్తున్నాయి.. అదేవిధంగా కేసీఆర్ నిర్ణయం కాంగ్రెస్, బీజేపీ పార్టీల గెలుపుకు కలిసి వస్తున్న అంశంగా పేర్కొంటున్నారు..