Telugu News » Taapsee pannu: రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..?

Taapsee pannu: రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..?

తాప్సీ కొద్ది రోజులుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో(Mathias Bo) తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

by Mano
Taapsee Pannu: The star heroine who got married secretly..?

హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee pannu)  పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా ఇక్కడ అనుకున్న విజయాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ ఇప్పుడు పెళ్లి పీటలెక్కినట్లు తెలుస్తోంది. అయితే తాప్సీ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Taapsee Pannu: The star heroine who got married secretly..?

తాప్సీ కొద్ది రోజులుగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో(Mathias Bo) తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మార్చి 20న ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించినట్లు సమాచారం. 23న ఉదయ్‌పూర్‌లో తాప్సీ-మథియాస్ బోతో పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.

అయితే వీరి వివాహానికి స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు టాక్. అయితే, ఈ వార్తలకు గల కారణం లేకపోలేదు. తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కనిక తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో తాప్సీ పెళ్లికే వెళ్లారంటూ పలువురు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఈ వివాహానికి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సైతం వెళ్లినట్లు టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే తాప్సీ స్పందించే వరకు వేచిచూడాల్సిందే.

తాప్సీ పెళ్లి గురించి వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఇదివరకే ఇలాంటి వార్తలు రావడంతో తాప్సీ స్పందించింది. వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ పేర్కొంది. ఎవరినీ ఒత్తిడి చేయకూడదని, ఒకవేళ తాను దేనిగురించైనా స్వయంగా వెల్లడిస్తానన్నారు. పెళ్లి అనేది అందరి జీవితాల్లో ముఖ్యమైన భాగమని, దాని గురించి దాచాలనుకోవడంలేదని స్పష్టం చేసింది. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందంటూ చెప్పుకొచ్చింది.

You may also like

Leave a Comment