Telugu News » Mahadev Case : సంచలనంగా మారిన మహాదేవ్ బెట్టింగ్ యాప్.. మాజీ సీఎంపై ఎఫ్ఐఆర్..!

Mahadev Case : సంచలనంగా మారిన మహాదేవ్ బెట్టింగ్ యాప్.. మాజీ సీఎంపై ఎఫ్ఐఆర్..!

లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం వల్ల రాజ్‌నంద్‌గావ్‌ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో సైతం బీజేపీకి నష్టం వాటిల్లుతుందని అందుకే నేరుగా ఎదుర్కొనలేక ఇలా భయపెట్టాలని చూస్తున్నట్లు భూపేష్ బఘేల్‌ స్పష్టం చేశారు.

by Venu

మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ ( Bhupesh Baghel)ను మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ (Mahadev Betting App) కుంభకోణంలో నిందితుడిగా పేర్కొంటూ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) పోలీసులు కేసు నమోదు చేశారు. దీని విలువ సుమారు రూ. 6,000 కోట్లు అని తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో బఘేల్ పేరును చేర్చారు. ఇతనితో పాటు మహదేవ్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్ మరియు రవి ఉప్పల్‌తో పాటు మరో 16 మంది పేర్లు ఉన్నాయి.

మరోవైపు ఈ అంశంపై మాజీ సీఎం స్పందించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయపరమైనదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఛత్తీస్‌గఢ్‌లో ఓడిపోతామనే భయంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.. ఇదిలా ఉండగా కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మహాదేవ్ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించి 72 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్ తో పాటు దేశవ్యాప్తంగా 450 మందిని పైగా అరెస్టు చేసిందని బఘేల్ వివరించారు.

అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం వల్ల రాజ్‌నంద్‌గావ్‌ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో సైతం బీజేపీకి నష్టం వాటిల్లుతుందని అందుకే నేరుగా ఎదుర్కొనలేక ఇలా భయపెట్టాలని చూస్తున్నట్లు భూపేష్ బఘేల్‌ స్పష్టం చేశారు. ఈ కేసులో అసలు నిందితులను అరెస్టు చేయడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. కాన్సులేట్ జనరల్ సమక్షంలో స్పందించిన శుభమ్ సోనీని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు..

భారతదేశానికి తీసుకురావడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాగా గతంలో మహాదేవ్ యాప్‌ను నిషేధించాలని గూగుల్ కు లేఖ రాసినట్లు తెలిపిన భూపేష్ బఘేల్‌.. ఈ యాప్ మాత్రమే కాకుండా అనేక బెట్టింగ్ యాప్‌లు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయన్నారు.. ఈ విషయంలో రవి ఉప్పల్‌పై లుకౌట్ నోటీసు సైతం జారీ చేసినట్లు వివరించారు.

You may also like

Leave a Comment