Telugu News » Mallikarjuna Kharge: 2004 ఫలితాలే రిపీట్ అవుతాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే

Mallikarjuna Kharge: 2004 ఫలితాలే రిపీట్ అవుతాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే

పార్లమెంట్ ఎన్నికల్లో 2004 ఫలితాలే రిపీట్ అవుతాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల (LokSabha Elections 2024) కోసం మేనిఫెస్టోపై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఢిల్లీలో జరుగుతోంది.

by Mano

పార్లమెంట్ ఎన్నికల్లో 2004 ఫలితాలే రిపీట్ అవుతాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల (LokSabha Elections 2024) కోసం మేనిఫెస్టోపై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు.

మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశంలోని అన్ని గ్రామాల్లో, నగరాల్లో ప్రచారం చేయాలని ఆయన సూచించారు. భారత్ వెలిగిపోతోందంటూ 2004లో బీజేపీ ప్రచారం చేసిందని గుర్తు చేశారు. అప్పుడు ఏం జరిగిందో.. ఇప్పుడు అవే ఫలితాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అప్పటి గతే పడుతుందంటూ జోస్యం చెప్పారు.

పార్టీ మేనిఫెస్టోకు విస్తృత ప్రచారం కల్పించడం మన బాధ్యత అని, అయితే దేశంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టో చేరువకావాలని సూచించారు. ప్రతి హామీని కాంగ్రెస్ పూర్తిచేస్తుందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రతో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు.

రాహుల్ చేసింది కేవలం రాజకీయ యాత్ర కాదని, ఇలాంటిది ఇంతముందు ఏ నాయకుడు చేయలేదంటూ వ్యాఖ్యానించారు. రెండు యాత్రలతో దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్తోపాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఐదు గ్యారంటీ పథకాలతో తెలంగాణలో పాగా వేసిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై దృష్టిపెట్టింది. అందుకు తగినట్లుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. మహిళల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ‘నారీ న్యాయ్’ పేరుతో ఐదు హామీలను ప్రకటించింది. మరోవైపు అధికారంలో రాగానే పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. ఇదే కాకుండా ‘కిసాన్ న్యాయ్’ పేరిట ఐదు హామీలు ప్రకటించింది.

You may also like

Leave a Comment