ముంబై (Mumbai), గోరఖ్‌పూర్ (Gorakhpur) వెళ్లున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్ (Godan Express)లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం.. రైలు లగేజీ కంపార్టుమెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.. నాసిక్ (Nashik) రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కాగా ఈ ప్రమాదంలో రెండు రైలు బోగీలు దగ్ధమయ్యాయని తెలుస్తోంది.
మరోవైపు ప్రమాదం విషయం తెలుసుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదంలో దగ్ధం అయిన రెండు బోగీలను తొలగించిన వెంటనే రైలు యథావిధిగా గోరఖ్‌పూర్‌కు బయల్దేరి వెళ్లిపోయింది. కాగా ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే పోలీసులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం రాజస్థాన్‌లో తెల్లవారుజామున రైలు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.. అజ్మేర్ సమీపంలో సబర్మతి- ఆగ్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇంజిన్, నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు.
ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ప్రమాదం చోటుచేసుకోవడంతో ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు.. ఇక ఈ మధ్య కాలంలో తరచుగా రైళ్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే..