Telugu News » Maheshwar Reddy : సీఎం రేవంత్‌కు బీజేపీ ఎల్పీ నేత సంచలన సవాల్..!

Maheshwar Reddy : సీఎం రేవంత్‌కు బీజేపీ ఎల్పీ నేత సంచలన సవాల్..!

డ్రామా ఆడుతున్నరేవంత్ రెడ్డి, హరీష్ రావు ల మధ్య చీకటి ఒప్పందం ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. లోకల్ పార్టీకి ఎక్కువ, జాతీయ పార్టీకి తక్కువ కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.

by Venu

తెలంగాణ (Telangana)లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. నేతలు సవాళ్ళు విసురుతూ రాజీనామా చేస్తామా అనే ఛాలెంజ్ పాలిటిక్స్ తో కిక్కు ఎక్కిస్తున్నారు.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పలు సవాళ్ళతో కాకా రేపుతుండగా.. బీజేపీ నేతలు సైతం తాము ఏం తక్కువ కాదని ఇదే దారిలో వెళ్తుండటం కనిపిస్తోంది. తాజాగా ఈ రేస్‌లోకి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎంటర్ అయ్యారు.

హైదరాబాద్ (Hyderabad) నాంపల్లిలోని బీజేపీ (BJP) స్టేట్ ఆఫీస్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేవలం రూ.2 లక్షల రుణమాఫీపైనే సవాల్ విసురుతున్నారు.. మరీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నేరవేరిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. సీఎం చెప్పినట్లు ఆగస్ట్ 15 లోపు అన్ని హామీలు నేరవేరిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకొంటానని మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అలాగే కాళేశ్వరం మ్యాటర్ పక్కన పెట్టడానికి ఫోన్ ట్యాపింగ్ తెరమీదకు తెచ్చారని ఆరోపించారు.

డ్రామా ఆడుతున్నరేవంత్ రెడ్డి, హరీష్ రావు ల మధ్య చీకటి ఒప్పందం ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. లోకల్ పార్టీకి ఎక్కువ, జాతీయ పార్టీకి తక్కువ కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేసిన మహేశ్వర్ రెడ్డి.. రేవంత్, బాలకృష్ణ అభిమానని తెలుసు కానీ ఆయనలా మాట్లాడుతావని అనుకోలేదన్నారు.
ఆరు గ్యారెంటీ లను పక్కన పెట్టీ సవాళ్లు ప్రతి సవాళ్లు ఎందుకని ప్రశ్నించిన ఆయన.. హరీష్ ను రేవంత్ షిండేగా తయారు చేసుకొంటున్నార

You may also like

Leave a Comment