Telugu News » MATI : భారత్ చేసిన మేలును మరవలేం…. ఆ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం…!

MATI : భారత్ చేసిన మేలును మరవలేం…. ఆ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం…!

ప్రధాని మోడీ (PM Modi), భారత్ పై మంత్రుల వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించింది.

by Ramu
Maldives tourism body MATI condemns derogatory comments against PM Modi

మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో భారత్ కు‘మాల్దీవ్స్‌ అసోషియేషన్ ఆఫ్‌ టూరిజం ఇండస్ట్రీ (MATI)’మద్దతుగా నిలిచింది. ప్రధాని మోడీ (PM Modi), భారత్ పై మంత్రుల వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించింది. భారత్ తమకు అత్యంత సన్నిహితమైన దేశమని పేర్కొంది.

Maldives tourism body MATI condemns derogatory comments against PM Modi

భారత్ కు ఒక మంచి పొరుగు దేశమని తెలిపింది. మాల్దీవులు సంక్షోభంలో చిక్కుకున్న ప్రతిసారి భారత్ అందరికన్నా ముందు స్పందించిందని చెప్పింది. కరోనా సమయంలోనూ మాల్దీవులకు భారత్, ఆ దేశ ప్రజలు తమకు గొప్ప మేలు చేశారని వివరించింది. తమతో అత్యంత సన్నిహిత సంబంధాలు ప్రభుత్వానికి, భారత ప్రజలకు తాము రుణపడి ఉంటామని ప్రకటించింది.

‘మాల్దీవుల పర్యాటక పరిశ్రమకు భారత్ గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. కొవిడ్ సమయంలో సరిహద్దులను తిరిగి తెరిచిన వెంటనే పర్యాటక రంగాన్ని పునరుద్దరించడంలో భారత్ గొప్ప సహాయాన్ని అందించింది. అందువల్ల రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలోపేతం కావాలని మేము కోరకుంటున్నాం’అని ప్రకటన విడుదల చేసింది.

ఇరు దేశాల సత్సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే చర్యలు లేదా ప్రసంగాలకు దూరంగా ఉంటామని తెలిపింది. ఇటీవల లక్షద్వీప్ లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అక్కడ పర్యటించారు. లక్షద్వీప్ అందాలను వర్ణిస్తూ దానికి సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దీనిపై మాల్దీవ్స్ కు చెందిన మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment