Telugu News » MLC Jeevan Reddy: రాజీనామాలపై గవర్నర్ జాప్యం తగదు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

MLC Jeevan Reddy: రాజీనామాలపై గవర్నర్ జాప్యం తగదు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసి దాదాపు నెల రోజులు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ చేయడంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాప్యం చేయడం తగదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

by Mano
MLC Jeevan Reddy: Governor's delay on resignations is inappropriate: MLC Jeevan Reddy

టీఎస్పీఎస్సీ చైర్మన్ (TSPSC Chairman), సభ్యుల రాజీనామాలు చేసి దాదాపు నెల రోజులు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ చేయడంలో గవర్నర్(Telangana Governor) తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soudararajan) జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Mlc Jeevan Reddy) ఆరోపించారు.

MLC Jeevan Reddy: Governor's delay on resignations is inappropriate: MLC Jeevan Reddy

గాంధీ భవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలంటే టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను భర్తీ చేయాలన్నారు. రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

రాజీనామాల నిర్ణయం జాప్యం అవ్వడం వల్ల నిరుద్యోగ యువతలో ఆందోళన కలుగుతుందని తెలిపారు. కమిషన్‌ సభ్యులు, చైర్మన్ వారంతట వారే రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్ర గవర్నర్ ఈ విషయంపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో నోటిఫికేషన్ల భర్తీకి కమిషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించకపోతే.. నోటిఫికేషన్ల భర్తీకి వెళ్లలేమని జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. మరో నెలలో లోక్ సభ ఎన్నికల హడాహుడి మార్చి, ఏప్రిల్ వరకు ఉంటుందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే టీఎస్పీఎస్సీ మెంబర్స్ ఫిలప్ కావాలన్నారు.

You may also like

Leave a Comment