Telugu News » Bharat Jodo Nyay Yatra : మణిపూర్‌లో భారత్ జోడో న్యాయ యాత్రకు లైన్ క్లియర్….!

Bharat Jodo Nyay Yatra : మణిపూర్‌లో భారత్ జోడో న్యాయ యాత్రకు లైన్ క్లియర్….!

జనవరి 14న పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. హప్తా కంగ్ జే భంగ్ మైదానం నుంచి యాత్రను ప్రారంభించేందుకు బీరెన్ సింగ్ సర్కార్ అనుమతులు ఇచ్చింది.

by Ramu
Manipur govt approves venue for Rahul Gandhi's 'Bharat Jodo Nyay Yatra

మణిపూర్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)కు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో యాత్ర నిర్వహించేందుకు మణిపూర్ (Manipur) ప్రభుత్వం అనుమతిచ్చింది. జనవరి 14న పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. హప్తా కంగ్ జే భంగ్ మైదానం నుంచి యాత్రను ప్రారంభించేందుకు బీరెన్ సింగ్ సర్కార్ అనుమతులు ఇచ్చింది.

Manipur govt approves venue for Rahul Gandhi's 'Bharat Jodo Nyay Yatra

జనవరి 14న రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో యాత్రను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్టు ఇంపాల్ తూర్పు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ యాత్రలో ఎంత మంది పాల్గొంటారు, వాళ్ల పేర్లను ముందుగానే అధికారులకు అందజేయాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

జనవరి 14న మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వాలని ఎనిమిది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఈ రోజు సీఎంతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా యాత్రకు అనుమతులు ఇవ్వలేమని సీఎం బీరెన్ సింగ్ చెప్పారని పీసీసీ చీఫ్ మేఘా చంద్ర వెల్లడించారు.

ఈ క్రమంలో యాత్రపై ఉత్కంఠ నెలకొంది. మణిపూర్ సర్కార్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే షెడ్యూల్‌ ప్రకారమే రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. యాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. అందువల్ల ఇంఫాల్‌ లోని మరో ప్రాంతం నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇంతలోనే అనుమతులు రావడంతో యాత్ర యథావిధిగా కొనసాగనుంది.

You may also like

Leave a Comment