Telugu News » Chandra Babu Naidu : రాతి యుగం కావాలా… స్వర్ణ యుగం కావాలా…. ప్రజలే తేల్చుకోవాలి….!

Chandra Babu Naidu : రాతి యుగం కావాలా… స్వర్ణ యుగం కావాలా…. ప్రజలే తేల్చుకోవాలి….!

తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన చెత్త సర్కార్ వైసీపీ అంటూ ధ్వజమెత్తారు. జగన్ అంటే అప్పుల అప్పారావంటూ ఎద్దేవా చేశారు.

by Ramu
tdp chief chandrababu naidu fire on CM Jagan

ఐటీ (IT) రంగంలో తెలుగు ప్రజలు తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత టీడీపీ (TDP)దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన చెత్త సర్కార్ వైసీపీ అంటూ ధ్వజమెత్తారు. జగన్ అంటే అప్పుల అప్పారావంటూ ఎద్దేవా చేశారు. రాతియుగం కావాలా ? స్వర్ణయుగం కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

tdp chief chandrababu naidu fire on CM Jagan

బొబ్బిలిలో నిర్వహించిన రా.. కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రా.. కదలిరా నినాదం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసమని చెప్పారు. గంజాయి అమ్మేస్తున్నారని, మట్టి మింగేస్తున్నారంటూ జగన్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. జగన్‌కు పోయే రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. పరిశ్రమలు పెడతామన్న వారి నుంచి వైసీపీ నేతలు వాటాలడగటంతో పారిశ్రామికవేత్తలు పారిపోయారని చెప్పారు.

జగన్ నిరుపేద అంట? పాపం ఆయనకి డ్రాయరు కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. జగన్‌కు ఓటేస్తే బానిసలైపోతామన్నారు. తనకు కష్టం వస్తే 90 దేశాలు స్పందించాయని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా అన్నా క్యాంటిన్లు పునః ప్రారంభిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెరగవని స్పష్టం చేశారు.

ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మంత్రి బొత్స ఏం మాట్లాడుతారో ఆయనకే అర్ధం కాదన్నారు. ఉత్తరాంధ్రాలో వెనుకబడిన కులాలను తొక్కేసి విజయసాయిరెడ్ది, వైవీ సుబ్సారెడ్డికి వైసీపీ పట్టం కట్టిందని పేర్కొన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందన్నారు. వైసీపీ ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుందని తెలిపారు.

మన తాత తండ్రుల భూమి పట్టాలపై జగన్ ఫోటో పెట్టారని అన్నారు. ఆయనేమైన వెంకటేశ్వరస్వామా, ఏసుప్రభువా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ఏ చట్టాన్నైనా ఆమోదించబోమన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే సిద్ధాంతం జగన్ ది అంటూ విరుచుకుపడ్డారు. బూతులు మాట్లాడే వైసీపీ నేతలకు బహుమానాలన్నారు. జగన్ ది రోత రాజకీయమని ఫైర్ అయ్యారు.

You may also like

Leave a Comment