Telugu News » Manish sisodia: మనీష్ సిసోడియాకు దక్కని ఊరట.. రిమాండ్ మళ్లీ పొడిగింపు..!

Manish sisodia: మనీష్ సిసోడియాకు దక్కని ఊరట.. రిమాండ్ మళ్లీ పొడిగింపు..!

తూర్పు ఢిల్లీలోని పట్పర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సిసోడియా.. నిన్న తన నియోజకవర్గ ప్రజలకు ఓ లేఖ రాశారు..

by Venu
Manish Sisodia: Relief for Manish Sisodia.. Court permission to meet his wife..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాకు చుక్కెదురైంది. ఏప్రిల్ 18 వరకు కస్టడీని పొడిగిస్తూ మరోసారి కోర్టు నిర్ణయిం తీసుకొంది. నేడు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో పోలీసులు ఆయనను హాజరపర్చారు. ఈ క్రమంలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈనెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర ఏజెన్సీలు మద్యం కుంభకోణంలో తన ప్రమేయాన్ని ఇంకా రుజువు చేయలేదని పేర్కొన్నారు.

Supreme Court denies bail to Manish Sisodia in Delhi excise policy scam caseఇదిలా ఉండగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిబ్రవరి 26, 2023 న లిక్కర్ స్కామ్‌ (Liquor Scam)లో మనీష్ సిసోడియా (Manish sisodia)ను అరెస్టు చేసింది. కాగా ఇదే నెల 28న ఢిల్లీ (Delhi) కేబినెట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన ఆయన.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మార్చి 9న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా అరెస్టు చేసింది. ఇక అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు.

ఇంత వరకు ఆయనకు బెయిల్ లభించలేదు. మరోవైపు తూర్పు ఢిల్లీలోని పట్పర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సిసోడియా.. నిన్న తన నియోజకవర్గ ప్రజలకు ఓ లేఖ రాశారు. త్వరలోనే తాను జైలు నుంచి బయటకు వస్తానని.. అందర్ని కలుస్తానని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లు జైలు జీవితం గడిపిన మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా తనకు ఆదర్శమని వెల్లడించారు..

జైల్లో ఉన్నాక నియోజకవర్గ ప్రజలపై ప్రేమ పెరిగిందని తెలిపిన ఆయన.. తన బలం ప్రజలేనని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇదే కేసులో ఆప్ నేత సంజయ్‌ సింగ్‌కు బెయిల్ లభించింది. దీంతో ఆయన ఇటీవలే తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తో పాటు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఇదే జైల్లో ఉన్నారు. వీరు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.

You may also like

Leave a Comment