Telugu News » Mary Kom: ఆ వార్తలు నమ్మొద్దు.. నేనింకా రిటైర్మెంట్ ప్రకటించలేదు: బాక్సర్ మేరీ కోమ్

Mary Kom: ఆ వార్తలు నమ్మొద్దు.. నేనింకా రిటైర్మెంట్ ప్రకటించలేదు: బాక్సర్ మేరీ కోమ్

తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని మేరీ కోమ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.

by Mano
Mary Kom: Don't believe the news.. I haven't announced my retirement yet: Boxer Mary Kom

భారత దిగ్గజ బాక్సర్(Indian legendary boxer) మేరీ కోమ్(Mary Kom) రిటైర్మెంట్(Retirement) ప్రకటించారంటూ గురువారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, అలాంటి వార్తలపై తాజాగా ఆమె స్పందించారు.

Mary Kom: Don't believe the news.. I haven't announced my retirement yet: Boxer Mary Kom

తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని మేరీ కోమ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఎప్పుడు రిటైర్మెంట్ అయినా తప్పకుండా మీడియా ముందుకు వస్తానని చెప్పారు. కానీ, తాను రిటైర్మెంట్ ప్రకటించానంటూ కొన్ని మీడియా కథనాలు వస్తుండడాన్ని ఖండించారు.

ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 24న తాను దిబ్రూఘర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని, అందులో పిల్లలను ప్రోత్సహిస్తూ మాట్లాడానని చెప్పారు. తనకు ఇప్పటికీ క్రీడల్లో ఇంకా సాధించాలనే కోరిక ఉందన్నారు.

అయితే, ఒలింపిక్స్‌లో వయోపరిమితి కారణంగా పాల్గొనడానికి వీలుండదని చెప్పానని అన్నారు. తన మాటలను వక్రీకరించి వార్తలు ప్రసారం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వయోపరిమితి ఉన్నప్పటికీ తన ఆటను కొనసాగించగలనని తెలిపారు. ఇప్పటికీ తాను ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలనుకుంటున్నట్లు తన పిల్లలతో చెప్పానని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment