Telugu News » Governor Tamilisai : కౌశిక్ రెడ్డిపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..!

Governor Tamilisai : కౌశిక్ రెడ్డిపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..!

న్నికలను ప్రభావితం చేసే ఇలాంటి అభ్యర్థుల వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ఎవరూ ఒత్తిడి చేయొద్దని.. ఓటు అనేది ప్రధాన ఆయుధమని తెలిపారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలని చెప్పారు.

by admin
brs mla padi koushik reddy

మొన్నటి ఎన్నికల్లో హుజూరాబాద్ (Huzurabad) నుంచి గెలిచారు పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy). 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 8వ సారి సత్తా చాటాలని భావించిన బీజేపీ సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ (Eatala Rajender) ను ఓడించారు ఈయన. అయితే.. ఎన్నికల సమయంలో తన భార్య, బిడ్డతో కలిసి సెంటిమెంట్ వర్కవుట్ చేయడంలో సక్సెస్ అయ్యారు కౌశిక్ రెడ్డి. తనను గెలిపించకపోతే శవయాత్రేనంటూ కన్నీటిపర్యంతమైన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది కేసుల వరకు వెళ్లింది. అయితే.. మరోసారి కౌశిక్ రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. దీనికి కారణం గవర్నర్ తమిళిసై (Governor Tamilisai).

brs mla padi koushik reddy

గురువారం ఓటర్స్ డే. ఈ సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూలో జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై హాజరై మాట్లాడారు. ఓటు గొప్పతనం గురించి ప్రసంగించారు. ఓటర్ అనే వ్యక్తి తప్పకుండా ఓటు వేయాలని సూచించారు. ఈవీఎం బాక్స్‌ పైన నోటా అనే ఆప్షన్ ఉన్నప్పటికీ దానికి తాను వ్యతిరేకమని తెలిపారు. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందన్నారు.

ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయనపై గవర్నర్ సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని.. ఎన్నికలను ప్రభావితం చేసే ఇలాంటి అభ్యర్థుల వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ఎవరూ ఒత్తిడి చేయొద్దని.. ఓటు అనేది ప్రధాన ఆయుధమని తెలిపారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలని చెప్పారు.

స్టేట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ కు మధ్య వారధిగా ఉండటం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు తమిళిసై. సాధారణ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారి హోం ఓటింగ్ మంచి పరిణామమన్నారు. ఓటింగ్ రోజు సెలవు సరదా కోసం కాదని యువత గుర్తించుకోవాలని సూచించారు. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్లు అనుకోవాలని.. ఓటర్ మార్క్ ప్రౌడ్‌ గా ఫీల్ అవ్వాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ‘ఓట్’ అనే పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు.

You may also like

Leave a Comment