Telugu News » Prathipati Pullarao: ప్రత్తిపాటి పుల్లారావు FAKE చరిత్ర..!

Prathipati Pullarao: ప్రత్తిపాటి పుల్లారావు FAKE చరిత్ర..!

అవెక్సా కంపెనీలో 175 కోట్ల విలువైన షేర్లు కుర్రా జోగేశ్వరరావుకి పత్తిపాటి పుల్లారావు డబ్బులు తీసుకోకుండానే ట్రాన్స్‌ఫర్ చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో పుల్లారావుకి జోగేశ్వరరావు బినామీగా భావిస్తున్నారు.

by Venu
Prathipati Pullarao Son Sarath arrested

– ఫేక్ టర్నోవర్లు
– ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు
– ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకు లోన్లు
– ఐటీ జీఎస్టీ ఎగవేతలు
– ఎలక్షన్ అఫిడవిట్ లో ఫేక్ ఆదాయాలు
– పుల్లారావు సృష్టి.. అవెక్సా కార్పొరేషన్ ఫేక్ కంపెనీ
– కుమారుడి అరెస్ట్ తో అడ్డంగా బుక్కయ్యారా?
– ఎన్నికల వేళ టెన్షన్ లో ప్రత్తిపాటి
– టికెట్ క్యాన్సిల్ చేయాలంటూ డిమాండ్లు

ప్రత్తిపాటి పుల్లారావు.. టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్. వివాదాలకు దూరం అని చెబుతుంటారు. కానీ, ఆయనలో కనిపించని ఇంకో ముఖం దాగి ఉంది. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టే పుల్లారావు జీవితంలో రెండో యాంగిల్ ఉంది. ఇది కొందరికే తెలుసు. తాజాగా ఆయన కుమారుడు శరత్ అరెస్ట్ తో బాగోతం అంతా బయటకొచ్చింది. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో శరత్ పై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.

Prathipati Pullarao Son Sarath arrested

ప్రత్తిపాటి శరత్ (ఎడమ వైపు ఫోటోలో), ప్రత్తిపాటి పుల్లారావు (కుడి వైపు ఫోటోలో)

అరెస్ట్ ఎందుకు.. కేసు వివరాలేంటి..?

నిధులు మళ్లించి పన్ను ఎగవేశారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రత్తిపాటి పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురి పేర్లు నమోదు చేశారు. అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే.. టీడీపీ అధికారంలో ఉండగా.. మంత్రి హోదాలో ప్రత్తిపాటి పుల్లారావు అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈయన భార్య వెంకాయమ్మకు అగ్రిగోల్డ్ ఆస్తులు అక్రమంగా బదిలీ అయినట్టు సీఐడీ విచారణలో తేలినట్టు వార్తలు వచ్చాయి. శరత్ కు చెందిన అవెక్సా కంపెనీపై 2020లో ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో అవెక్సా ఇన్‌ఫ్రా, లోకేష్‌ సన్నిహితుడు దిరిశల నరేష్ చౌదరికి చెందిన డీఎన్‌సీ ఇన్‌ఫ్రా, శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకొన్న వేలాది డాక్యుమెంట్లలో కమీషన్లు చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. అప్పుడే సుమారుగా రూ.2 వేల కోట్లకుపైగా దోపిడీ చేశారని అనుమానించారు.

దిరిశల నరేష్ చౌదరి, లోకేష్‌ సన్నిహితుడు

ఐటీ సోదాలతో గుట్టంతా బయటకు!

ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 40 ప్రదేశాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ మూడు కాంట్రాక్టు సంస్థలతో పాటు లెక్కకు మించిన సబ్‌ కాంట్రాక్టు సంస్థలు ఒకే చిరునామా నుంచి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లు దాఖలు చేయడంతో.. కమీషన్ల వ్యవహారంలో కొంత భాగం బహిర్గతమైంది. అదీగాక సబ్‌ కాంట్రాక్టుల ముసుగులో అవెక్సా ఇన్‌ఫ్రా, డీఎన్‌సీ ఇన్‌ఫ్రా నుంచి వసూలు చేసిన సొమ్ము దారి మళ్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. అయితే ఈ మూడు సంస్థలు చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైనవనే ఆరోపణలున్నాయి.

ప్రత్తిపాటి ‘రియల్’ మోసాలు

గతంలో ప్రత్తిపాటి ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ మోసాలు జరిగాయి. దీనికి సంబంధించి తెలంగాణలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి ఛార్జ్ షీట్ వేశారు. తాజాగా శరత్ అరెస్ట్ తో పాత కేసులు సైతం బయటపడుతున్నాయి. ఇందులో లోతుగా దర్యాప్తు ప్రారంభించిన అధికారుల దృష్టికి సంచలన విషయాలు తెలిసినట్టు సమాచారం. అవెక్సా కంపెనీలో 175 కోట్ల విలువైన షేర్లు కుర్రా జోగేశ్వరరావుకి పత్తిపాటి పుల్లారావు డబ్బులు తీసుకోకుండానే ట్రాన్స్‌ఫర్ చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో పుల్లారావుకి జోగేశ్వరరావు బినామీగా భావిస్తున్నారు. అదీగాక జోగేశ్వరరావు ప్రభుత్వ భూమిని, ఫోర్జరీ చేసి బ్యాంకు ఉద్యోగులతో కుమ్మక్కయి రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ టర్నోవర్లు, నకిలీ బ్యాంకు గ్యారెంటీలు పెట్టి రుణాలు సైతం ఇప్పించినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.

నాకేం పాపం తెలియదు- ప్రత్తిపాటి

తీగలాగితే డొంక కదిలినట్లు.. శరత్ అరెస్ట్ తో ప్రత్తిపాటి పుల్లారావుకి సంబంధించిన మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. కానీ, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పుల్లారావు అంటున్నారు. శరత్ అరెస్ట్ పై స్పందించిన ఆయన.. ఓటమి భయంతో జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కంపెనీకి సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. జగన్ కుట్రలో భాగంగానే పోలీసులు తన కుమారుడిని అరెస్ట్ చేశారని ఆరోపించారు.

రాజకీయంగా డ్యామేజ్

శరత్ అరెస్ట్ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. అసలే ఎన్నికల టైమ్. చిలకలూరి పేట నుంచి పుల్లారావు మరోసారి పోటీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కుమారుడు అరెస్ట్ కావడం రాజకీయంగా దెబ్బే. 1999 నుండి చిలుకలూరిపేట రాజకీయాల్లో ఈయన కీలకంగా ఉన్నారు. మొదట టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. పదేళ్లపాటు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయి.. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ, ఇటీవల యాక్టివ్ అయి టీడీపీ టికెట్ సాధించారు. అయితే.. ప్రత్తిపాటి పుల్లారావు అక్రమాలు వెలుగులోకి రావడంతో.. టికెట్ క్యాన్సిల్ చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది.

You may also like

Leave a Comment