Telugu News » Medigadda : వరద నీటితో బురద రాజకీయం.. బీఆర్ఎస్ ఆసక్తికర వీడియో ట్వీట్.. !

Medigadda : వరద నీటితో బురద రాజకీయం.. బీఆర్ఎస్ ఆసక్తికర వీడియో ట్వీట్.. !

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల వద్దకు భారీగా వరద నీరు చేరుతుందని పేర్కొంది. నామమాత్రంగా మరమ్మత్తు చర్యలు చేపట్టి వరద నీటితో కుంగిన పిల్లర్లను మరింత దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించింది.

by Venu
congress-leaders-are-criticizing-brs-leaders

రాష్ట్రంలో పాలకులు మారిన కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిప్పులా రగులుతూ ఉంది. ఇప్పటికే తెలంగాణ (Telangana)లో అధికార విపక్షాల మధ్య వార్ కాస్తా ప్రాజెక్ట్ వార్ గా మారిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. చిన్న చిన్న రిపేర్లు చేస్తే ఉపయోగపడే ప్రాజెక్ట్ ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తే.. పాలమూరుపై కేసీఆర్ (KCR) పగ పెంచుకొని ప్రాజెక్టులు పెండింగ్ పెట్టారని కాంగ్రెస్ (Congress) ఫైర్ అవుతోంది.

ఇదే సమయంలో కాళేశ్వరం (Kaleswaram) కుంగడంతో డిఫెన్స్ లో పడ్డ బీఆర్ఎస్ (BRS) ఎదురుదాడికి సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ఎఫెక్ట్ ఊహించని విధంగా పడటంతో.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు లైట్ గా తీసుకొంటే కాంగ్రెస్ తో మరింత డ్యామేజ్ తప్పదనుకున్నారో ఏమోగానీ.. వరద రాజకీయం కాస్త బురద రాజకీయంగా మార్చారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మరో కొత్త రాగాన్ని అందుకొందని అంటున్నారు..

మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ పై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. ట్విట్టర్ వేదికగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల ఆసక్తికర వీడియో ఒకటి పోస్ట్ చేసింది. వీడియోలో కుంగిన పిల్లర్ల వద్ద వరద నీరు పారుతోందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల వద్దకు భారీగా వరద నీరు చేరుతుందని పేర్కొంది. నామమాత్రంగా మరమ్మత్తు చర్యలు చేపట్టి వరద నీటితో కుంగిన పిల్లర్లను మరింత దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించింది.

వరద నీటితో బురద రాజకీయం చేసి బీఆర్ఎస్‌ని బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలు మానుకోవాలని సూచించింది. మేడిగడ్డ పిల్లర్లకు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. మొత్తానికి జల వివాదాలు, ప్రాజెక్టుల నష్టాలపై పోరాటాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదని వీరి వాలకం గమనించిన వారు అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment