Telugu News » Rameshwaram Cafe Blast: పేలుడు వెనుక వ్యాపార శతృత్వం.. హోం మంత్రి వివరణ..!

Rameshwaram Cafe Blast: పేలుడు వెనుక వ్యాపార శతృత్వం.. హోం మంత్రి వివరణ..!

బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe) పేలుడు ఘటన దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పలు నగరాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర(Home Minister Parameshwara) మాట్లాడారు.

by Mano
Rameshwaram Cafe Blast: Business enmity behind the blast.. Explained by Home Minister..!

బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe) పేలుడు ఘటన దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పలు నగరాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర(Home Minister Parameshwara) మాట్లాడారు. అయితే, ఈ ఘటనకు 2022లో మంగళూరులో జరిగిన కుక్కర్ పేలుడుకు సంబంధం ఉందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

Rameshwaram Cafe Blast: Business enmity behind the blast.. Explained by Home Minister..!

హోం శాఖ మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ.. వ్యాపార పోటీ, శతృత్వం, త్వరలో జరగనున్న ఎన్నికలు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్ర, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో ఈ పేలుడు జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. వ్యాపార ప్రత్యర్థులు అసూయతో కూడా చేసి ఉండొచ్చనే కోణంలో విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.

అయితే, రామేశ్వరం కేఫ్‌కు 11 యూనిట్లు ఉన్నాయనీ.. దాని యజమానులు 12వ బ్రాంచ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు మంత్రి. అందుకు అడ్వాన్స్ డిపాజిట్ సైతం చెల్లించారని ఆయన వివరించారు. స్థిరమైన ప్రభుత్వం ఉండటం. పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తున్నారనీ.. వారు పెట్టుబడులు పెట్టకుండా భయభ్రాంతులకు గురిచేయడానికి లేదా ఇతర తెలియని కారణాలు సైతం ఉండొచ్చని హోంమంత్రి పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసును బెంగళూర్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. టోపి, ముసుగు ధరించి వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సీసీటీవీలో అతడి విజువల్స్ కనిపించాయి. కేసును ఛేదించడానికి 8 టీంలు పనిచేస్తున్నాయి. వీరితో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కూడా విచారణ జరుపుతున్నాయని హోమంత్రి పరమేశ్వర వెల్లడించారు.

అయితే, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. నిందితుడు టిఫిన్ చేసేందుకు వచ్చి.. బాంబు ఉన్న బ్యాగ్‌ను అక్కడే వదిలేసి వెళ్లాడు. టైమర్ సహాయంతో బాంబు పేల్చినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ కేసులో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ బాంబును వాడినట్లు నిర్ధారించారు పోలీసులు.

You may also like

Leave a Comment