Telugu News » Harish Rao : చక్రం తిప్పిన మంత్రి హరీష్ రావు.. బీఆర్ఎస్‌ గాలానికి కాంగ్రెస్ చేప..!!

Harish Rao : చక్రం తిప్పిన మంత్రి హరీష్ రావు.. బీఆర్ఎస్‌ గాలానికి కాంగ్రెస్ చేప..!!

కాంగ్రెస్‌లో (Congress) టికెట్ దక్కక పోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan Reddy)మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ ఇప్పటికే గులాబీ గూటిలో వాలారు. అయితే కాంగ్రెస్ నుండి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ దివంగత పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు గులాబీ పార్టీ పావులు కదుపుతోంది.

by Venu

మొన్నటి వరకు పార్టీని వదిలి వెళ్తున్న నేతలతో పరేషాన్ అయిన బీఆర్ఎస్ లోకి క్రమక్రమంగా చేరికల జోరు పెరుగుతుంది. ఒక దశలో నేతల వరుస రాజీనామాలు బీఆర్ఎస్ (BRS)ని డీలా పడేలా చేశాయి. ఈ క్రమంలో గులాబీ ముఖ్య నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి మళ్లీ నేతల చేరికల జోరు పెంచారు.. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తికి గురై.. పక్క దారులు చూస్తున్నారు.

ఈ అవకాశాన్ని సానుకూలంగా మలచుకున్న బీఆర్ఎస్ వారికి గాలం వేస్తూ పార్టీలో చేర్చుకుంటుంది. తాజాగా కాంగ్రెస్‌లో (Congress) టికెట్ దక్కక పోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan Reddy)మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ ఇప్పటికే గులాబీ గూటిలో వాలారు. అయితే కాంగ్రెస్ నుండి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ దివంగత పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు గులాబీ పార్టీ పావులు కదుపుతోంది.

ఈ విషయంలో విష్ణువర్ధన్ సానూకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే విష్ణువర్ధన్ బీఆర్ఎస్‌లో చేరే విషయంలో మంత్రి హరీష్ రావు (Harish Rao) కీలకంగా వ్యవహరించారు. మరోవైపు కేటీఆర్ (KTR) కూడా ఆశావహులను ఒక చోటుకి చేర్చి పార్టీ ఆగం కాకుండా చర్యలు తీసుకున్నారని కారు కార్యకర్తలు ఇప్పటికే అనుకుంటున్నారు.. ఇక ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదు.. ఇలాంటి టైమ్ లో బీఆర్ఎస్‌ పై ఓటర్లకు నమ్మకం పోకుండా బీఆర్ఎస్‌ అధినేతలు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం 70 ఎంఎం లో కనిపిస్తుందనే టాక్ వినిపిస్తుంది.

You may also like

Leave a Comment