Telugu News » MK Stalin: మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు.. మాజీ సీఎంపై స్టాలిన్ దావా..!

MK Stalin: మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు.. మాజీ సీఎంపై స్టాలిన్ దావా..!

భారీ మాదక ద్రవ్యాల రాకెట్ (Drugs racket) ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. దీనిలో సినీ నిర్మాత, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్(Zafar Sadiq) పేరు వెలుగులోకి రావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసులో విపక్ష పార్టీలు చేస్తోన్న ఆరోపణలపై సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) తీవ్రంగా స్పందించారు.

by Mano
MK Stalin: Allegations in the drug case..Stalin's lawsuit against the former CM..!

భారీ మాదక ద్రవ్యాల రాకెట్ (Drugs racket) ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. దీనిలో సినీ నిర్మాత, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్(Zafar Sadiq) పేరు వెలుగులోకి రావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై అన్నాడీఎంకే, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ కేసులో విపక్ష పార్టీలు చేస్తోన్న ఆరోపణలపై సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) తీవ్రంగా స్పందించారు.

MK Stalin: Allegations in the drug case..Stalin's lawsuit against the former CM..!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై సీఎం స్టాలిన్ పరువునష్టం దావా వేశారు. రాజకీయ శత్రుత్వంతో, ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ ఆ దావాలో పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించిన సంగతి తెలిసిందే.

ఈ నెట్‌వర్క్ భారత్ సహా మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత జాఫర్ సాదిక్ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. సాధిక్… డీఎంకే పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ఆఫీస్ బేరర్. ఇటీవల బయటపడిన భారీ మాదక ద్రవ్యాల రాకెట్‌లో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు.

అతడు క్రమశిక్షణను ఉల్లంఘించి చెడ్డపేరు తీసుకొచ్చినట్లు డీఎంకే పేర్కొంది. జాఫర్‌ను ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎన్ఆర్ విభాగం పదవి నుంచి తొలగించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు.

You may also like

Leave a Comment