కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ గౌడ్ (MLA KP Vivekanand Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏదో అభద్రతా భావంలో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉన్నారని విమర్శించారు. మేము గెట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వస్తారని అనడంపై మండిపడ్డారు. గేట్లు తెరిస్తే రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS) గొర్రెలు కాదని చురకలు అంటించారు..

గత ప్రభుత్వ హాయంలో జరిగిన పనులను ఆపే ప్రయత్నాలను సీఎం చేస్తున్నారని ఆరోపించారు. పాలన సరిగ్గా చేయడం తెలియక.. పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని వివేకానంద్ గౌడ్ మండిపడ్డారు.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కల్పితాలతో కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు.. గత ప్రభుత్వంలో వేల కోట్లు పెట్టుబడులు వచ్చేవి.. కానీ ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు కూడ గుజరాత్ పోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిద్రపోతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని విమర్శించారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దలే కరీంనగర్.. నిజామాబాద్ లో బీజేపీకి సపోర్టు చేసారని ఆరోపించిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గత వందరోజులు పాలన పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్కకు యాదాద్రిలో జరిగిన అవమానం పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని పేర్కొన్నారు.. మేడిగట్టను రిపేర్ చేసి గేట్లు మూసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కే.పి.వివేకానంద్ గౌడ్ కోరారు.
 
			         
			         
														