ఎస్సారెస్పీ(SRSP)లో నీటి కొరతకు కేసీఆర్(KCR)దే నైతిక భాధ్యత అని ఎమెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వానాకాలం సీజన్‌కు సాగునీరు అందకపోవడానికి కేసీఆరే కారణమని మండిపడ్డారు. కమిషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథను తీసుకొచ్చారని.. అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేనివి సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలల్లో చేసి చూపారని వెల్లడించారు.
వర్షాకాలంలో మేడిగడ్డ నీటిని ఎస్సారెస్పీకి తరలించలేదని జీవన్‌రెడ్డి తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదన్నారు. మిషన్ భగీరథ టెక్నికల్ ఆఫీసర్‌ను ఉరితీయాలంటూ సంచలన ఆరోపణలు చేశారు. 20 కిలోమీటర్ల నీటి ప్రవాహం తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ సున్నా అని తేలిందన్నారు. పవర్ ప్లాంట్‌పై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయడంతో కేసీఆర్‌కు భయం మొదలైందని సెటైర్లు వేశారు.
అయితే, బీఆర్ఎస్ నేతలకు ఇన్ని రోజులు కేసీఆర్ మాట్లాడితే వినసొంపుగా ఉంటుందనీ.. అదే రేవంత్ రెడ్డి మాట్లాడితే సీసం పోసినట్లు ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారని నిలదీశారు. అదేవిధంగా మేడిగడ్డ లేకుంటే కాళేశ్వరం లేదన్నారు జీవన్ రెడ్డి. మేడిగడ్డ కుంగిన తర్వాత నీటి పంపింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
ప్రజలకు మంచి చేయాలనే కమిట్‌మెంట్ ఒక వైఎస్సార్‌కే ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పరిస్థితులు వచ్చాయని వెల్లడించారు. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ తుడిచిపెట్టుకుపొతుందని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. 2014ఎన్నికల మేనిఫెస్టో గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
మోడీ మరో కేసీఆర్ అని విమర్శించారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ బయట పెట్టడానికి బీజేపీ ఎందుకు బయపడుతుందో చెప్పాలన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేనప్పుడు.. ముస్లిం రిజర్వేషన్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తొలగిస్తామని హామీ ఇచ్చారు.