Telugu News » Telangana : రాష్ట్ర రాజకీయాల్లో డబుల్ డిజిట్ గేమ్.. బిగ్ స్కెచ్ లో ప్రధాన పార్టీలు..!

Telangana : రాష్ట్ర రాజకీయాల్లో డబుల్ డిజిట్ గేమ్.. బిగ్ స్కెచ్ లో ప్రధాన పార్టీలు..!

బీఆర్ఎస్ సైతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌పై గురి పెట్టింది. బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందనే విమర్శలకు లోక్ సభ స్థానాల్లో సత్తా చాటి సమాధానం ఇచ్చేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

by Venu
Election Results LIVE Updates

తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలకు ఒక లెక్క ఏర్పడిందని అంటున్నారు.. అంతకు ముందు ఎన్నికలు అంటే.. ఏదో జరుగుతున్నాయి అనేలా.. ఖర్చులు సైతం తక్కువగా ఉండేవని.. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలు అంటే.. చాలా ఖరీదు అయినవిగా మార్చేసిందనే ఆరోపణలు వచ్చాయి.. అదీగాక రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిందనే చర్చలు జరుగుతున్నాయి..

ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని మరిపించేలా సాగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో వీటిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మూడు ప్రధాన పార్టీలు గెలుపును డెడ్ లైన్ గా డిసైడ్ చేసుకొని ముందుకు సాగడం కనిపిస్తోంది. మొన్నటి వరకు ఉనికిని కాపాడుకోవడం ఎలా అని ఆలోచించిన బీఆర్ఎస్ సైతం రంగంలోకి దిగి.. ఎన్నికలను రసవత్తరంగా మార్చింది.

ఈమేరకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ నిన్న ఒకే రోజు సభలతో హోరెత్తించాయి. డబుల్ డిజిట్ (Double Digit) సీట్లే లక్ష్యంగా పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారింది. ఇదిలా ఉండగా 2019 లోక్ సభ ఎన్నికల్లో 17 లోక్ సభ స్థానాలకు గాను.. బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో గెలవగా ఈసారి మాత్రం ప్రధాన పార్టీలు డబుల్ డిజిట్‌పై కన్నేసి..చావో రేవో తేల్చుకోవడానికి సిద్దం అవుతున్నాయి..

మరోవైపు అధికార కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలలో 15 స్థానాలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజాదీవెన సభల్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థులను తూర్పారపడుతున్నారు. ఇక మేం ఏం తక్కువ తినలేదన్నట్లు.. నిన్న రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా (Amith Sha) సైతం 12 పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు..

అలాగే బీఆర్ఎస్ సైతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌పై గురి పెట్టింది. బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందనే విమర్శలకు లోక్ సభ స్థానాల్లో సత్తా చాటి సమాధానం ఇచ్చేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాబోయే పదేళ్లు తమదే అధికారం అని ముఖ్యమంత్రి సైతం పదే పదే ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో డబుల్ డిజిట్ డ్రీమ్ ఏ పార్టీని వరిస్తుందో అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది..

You may also like

Leave a Comment