Telugu News » Mlc Kavitha: ఎమ్మెల్సీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం..!

Mlc Kavitha: ఎమ్మెల్సీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం..!

ఈనెల 30న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో 'డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌'(Development economics) అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్నారు.

by Mano
MLC Kavitha is remanded for another 14 days!

యూకే(UK) లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Mlc kavitha)కు ఆహ్వానం అందింది. ఈనెల 30న యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో ‘డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌'(Development economics) అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్నారు.

Mlc Kavitha: A prestigious invitation to Mlc Kavitha..!

ఇటీవల బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్‌లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవిత భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై ఈనెల 30వ తేదీన ప్రసంగించాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పంపింది.

ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగించనున్నారు. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు.

మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటిని సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. తెలంగాణ అభివృద్ధిని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పడానికి సిద్ధమయ్యారు.

You may also like

Leave a Comment