Telugu News » MLC Kavitha: అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ కవిత

అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఎమ్మెల్సీ కవిత కోరారు. న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని స్పీకర్‌ నివాసంలో లేఖ అందజేశారు.

by Mano
MLC Kavitha: A statue of Phule should be installed in the assembly premises: MLC Kavitha

అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్‌(Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్‌ కుమార్(Gaddam Prasad Kumar)ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కోరారు. ఈమేరకు న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని స్పీకర్‌ నివాసంలో లేఖ అందజేశారు.

MLC Kavitha: A statue of Phule should be installed in the assembly premises: MLC Kavitha

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటైందని తెలిపారు. అదేవిధంగా సమానత్వ స్ఫూర్తిని నిలిపేలా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ ఫూలే అని కొనియాడారు.

అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యుడని గుర్తుచేశారు. మహోన్నతమైన ఈ వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఫూలేను తన గురువుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రకటించుకున్నారని తెలిపారు.

సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ స్వరాష్ట్రమై సుందర భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇనుమడింప జేయగలదని ఆ లేఖలో పేర్కొన్నారు.

You may also like

Leave a Comment