Telugu News » MLC Kavitha : డిప్యూటీ సీఎం భట్టికి-కవిత లేఖ.. రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్..!

MLC Kavitha : డిప్యూటీ సీఎం భట్టికి-కవిత లేఖ.. రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్..!

బీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ సైతం ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ప్రస్తావించారు. అంతేకాకుండా, రానున్న ఐదేళ్లలో బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తామన్నారని పేర్కొన్నారు..

by Venu
bjps agenda is complete brs leader kavitha

తెలంగాణ (Telangana) రాజకీయాలు వేడెక్కుతూ, వేసవిని మరిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ (Congress).. ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య నడుస్తున్న వార్.. క్రమక్రమంగా లోక్ సభ ఎన్నికల వరకు ఇలాగే ఉంటుందని అనుకొంటున్నారు.. రాష్ట్రంలో నియంత పోకడ వల్ల అధికారం కోల్పోయిందనే అపవాదు మూటగట్టుకొన్న గులాబీ పార్టీ.. అందులో నుంచి బయటకు వచ్చేలా చేసే ప్రయత్నంలో భాగంగా విమర్శలను వాడుకొంటుందని టాక్ వినిపిస్తోంది.

Congress demands that kavitha tell details of 30 lakh jobs

అందుకే బీఆర్ఎస్ లో ఉన్న నలుగురైనా తమ వాయిస్ పెంచుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha), డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) లేఖ రాశారు. బీసీ సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ తెలిపినట్లు గుర్తు చేశారు.

బీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ సైతం ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ప్రస్తావించారు. అంతేకాకుండా, రానున్న ఐదేళ్లలో బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తామన్నారని పేర్కొన్నారు.. అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను, రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని కవిత తెలిపారు. ఈ నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చినట్లవుతుందని, బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిధులు దోహదపడుతాయని అభిప్రాయపడ్డారు.

You may also like

Leave a Comment