Telugu News » అంగట్లో.. సర్కారీ ల్యాండ్!!

అంగట్లో.. సర్కారీ ల్యాండ్!!

మొత్తం 300 ప్లాట్లలో 98,975 గజాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.

by admin
mokila-phase-2-land-auction

– విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల విక్రయం
– యథేచ్ఛగా అమ్మేస్తున్న కేసీఆర్ సర్కార్
– మోకిల ఫేజ్‌-2లో అమ్మకాలకు నోటిఫికేషన్
– 300 ప్లాట్లలో 98,975 గజాల భూమి
– వేలానికి సిద్ధమైన హెచ్ఎండీఏ
– రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
– ఈనెల 21 వరకు రిజిస్ట్రేషన్‌ కు అవకాశం
– రిజిస్ట్రేషన్‌ తో పాటు లక్ష రూపాయల డిపాజిట్‌
– చదరపు గజానికి రూ.25 వేల కనీస ధర
– గత వేలంలో గరిష్ఠంగా గజానికి రూ.1.05 లక్షలు

ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఎంతమంది చెప్తున్నా… కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. ప్రభుత్వ భూముల అమ్మకం విషయంలో ఒకప్పుడు నానా రాద్ధాంతం చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు విచ్చలవిడిగా భూముల విక్రయాలు జరుపుతోంది. ఇప్పటికే పలుచోట్ల అమ్మకాలు జరిపిన సర్కార్ తాజాగా.. రంగారెడ్డి జిల్లా మోకిల ఫేజ్‌-2లో 300 ప్లాట్ల అమ్మకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

mokila-phase-2-land-auction

మొత్తం 300 ప్లాట్లలో 98,975 గజాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. లే అవుట్‌ లో 300 నుంచి 500 గజాల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 98,975 గజాల అమ్మకంతో రూ.800 కోట్లు ఆదాయం వస్తుందని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఈనెల 21 వరకు రిజిస్ట్రేషన్‌ కు అవకాశం కల్పించింది హెచ్ఎండీఏ.

వెయ్యి 180 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నోటిఫికేషన్‌ లో తెలిపింది. రిజిస్ట్రేషన్‌ తో పాటు లక్ష రూపాయల డిపాజిట్‌ కంపల్సరీ. చదరపు గజానికి రూ.25 వేల కనీస ధరగా నిర్ణయించింది. మోకిల తొలి ఫేజ్‌ వేలంలో గరిష్ఠంగా గజం రూ.1.05 లక్షలు, కనిష్ఠంగా రూ.72 వేలు పలికింది.

సోమవారం రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా.. 17న ప్రీ బిడ్డింగ్ మీటింగ్, 21న రిజిస్ట్రేషన్, అమౌంట్ డిపాజిట్ కు చివరి తేదీగా నిర్ణయించింది హెచ్ఎండీఏ. అలాగే, 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 30 ప్లాట్లకు ఈ-వేలం ఉంటుంది. 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 30 ప్లాట్లకు, 25, 28, 29 తేదీల్లో- రెండు సెషన్లలో రోజుకు 60 ప్లాట్ల చొప్పున ఈ-వేలం జరగనుంది.

You may also like

Leave a Comment