కోతికి కోపం వచ్చింది. ఓ తాతని మేడపై నుంచి తోసేసింది. తన ఇంటి మీదుకు దండెత్తి వచ్చిన కోతుల గుంపును చెదరగొట్టే ప్రయత్నంలో కోతి ఆగ్రహానికి గురయ్యాడు. నెక్స్ట్ మినిట్ హాస్పిటల్లో పడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొంతున్నాడు.
ఈ వింత ఘటన ఉత్తర్ప్రదేశ్(Uttarpradesh)లోని మథుర జిల్లాలో జరిగింది.గౌఘట్ కాశ్మీరీ (Gaughat Kashmiri) వీధిలో కోతుల సంచారం విపరీతంగా ఉంది.కొన్ని కోతులు ఓ ఇంటి మేడపైకి నానా హంగామా చేస్తుండగా..వాటిని చెదరగొట్టేందుకు 65 ఏళ్ల పెద్దాయన మేడపైకి వెళ్లాడు. అనంతరం వాటిని తరుముతూ..తనకు తెలియకుండానే మేడ అంచువరకు వచ్చాడు.
అదే సమయంలో..ఓ కోతి ఆ తాతగారిని వెనుక నుంచి నెట్టివేసింది. దీంతో మేడపై నుంచి రోడ్డుపై ఆ వృద్ధుడు కిందపడ్డాడు.వెంటనే అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాళ్లు..పెద్దాయనని ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఈ కోతుల గుంపు కారణంగా చాలా మంది గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
వాటి బెడద నుంచి విముక్తి కలిగించాలని అధికారులను వేడుకుంటున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులను విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.