ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరు కూడా చెప్పలేము. కొన్ని కొన్ని సినిమాలు హిట్ అవుతాయని అనుకుంటారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. కొన్ని కొన్ని సినిమాలు అస్సలు సైలెంట్ గా వచ్చి హిట్ లు కొట్టేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ అవ్వాలంటే, సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాని అందరికీ తెలిసే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నిజానికి మూవీ హిట్ అవ్వాలంటే కావాల్సింది ప్రమోషన్స్ కాదు. సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ బాగుండాలి అద్భుతంగా షూట్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ ని తెరమీదకి తీసుకురావాలి.
అప్పుడే సినిమా హిట్ అవుతుంది. ఇవన్నీ ఉండి, సినిమా ప్రమోషన్ చేస్తే సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది జనాలకి సినిమా చేరాలంటే ప్రమోషన్ ఒక్కటే మార్గం కానీ ప్రమోషన్ తో పాటు కంటెంట్ కూడా బాగుండాలి. అయితే కొన్ని కొన్ని సినిమాలు అసలు ప్రమోషన్ లేకుండానే హిట్లయిపోతు ఉంటాయి. సూపర్ హిట్ లుగా నిలుస్తూ ఉంటాయి. సైలెంట్ గా వచ్చి థియేటర్లలోకి భారీగా వసూళ్లను రాబడుతుంటాయి. కోట్ల రూపాయల కలెక్షన్లని వసూలు చేస్తూ ఉంటాయి. సలార్ సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.
Also read:
ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమా సూపర్ హిట్ అయింది రాజమౌళితో సినిమా యూనిట్ చేసిన ఒక ప్రమోషన్ ఈవెంట్ తప్ప ఇంకా ఏ ప్రమోషన్ ఆక్టివిటీస్ కూడా లేవు సినిమా మాత్రం అదిరిపోయింది. లియో సినిమా కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా కోసం విజయ్ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయినా చేద్దామనుకున్నారు కానీ పర్మిషన్ దొరకపోవడంతో క్యాన్సల్ అయిపోయింది అలానే షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన డంకి సినిమా కూడా ప్రమోషన్ చేయకుండానే హిట్ అయింది డీసెంట్ కలెక్షన్లనే రాబట్టడంతో ఈ సినిమా హిట్ అని చెప్పుకోవాలి రిలీజ్ కి ముందు టీం ఇంటర్వ్యూ తప్ప ఇక ఏ ప్రమోషన్స్ కూడా చేయలేదు కానీ మంచిగా సక్సెస్ అయ్యింది