కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) వైసీపీ(YCP)లో చేరతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీలో చేరిక వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి(Kirlampudi) నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన లేదా 16న ముద్రగడ ఫ్యామిలీ మాత్రమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు.
ప్రజల ఆశీస్సులతో వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడంతో కూర్చోవడానికే కాదు.. నిలబడడానికీ స్థలం సరిపోదన్నారు. వచ్చిన ప్రతీఒక్కరినీ తనిఖీ చేయడం ఇబ్బంది అని చెప్పడంతో తాడేపల్లి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు.
ప్రజలను నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు తెలిపారు. ఈనెల 15వ తేదీ లేదా 16వ తేదీన తానే స్వయంగా తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరాతానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ తనపై ఉండాలని కోరుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.