Telugu News » Praneeth Rao : ప్రత్యేక టీంకు ప్రణీత్రావు కేసు బదిలీ..!

Praneeth Rao : ప్రత్యేక టీంకు ప్రణీత్రావు కేసు బదిలీ..!

ఈ కేసులో పంజాగుట్ట పీఎస్​లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆధారాలు దొరక్కుండా పక్కా ప్లాన్‌‌‌‌తో ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌లో హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు.

by Venu
police dept 62 dsp transfers telangana

తెలంగాణ (Telangana)లో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కాగా ఎస్ఐబీ (SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్రావు (Praneeth Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిన్న పంజాగట్ట (Panjagutta) పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొన్నారు.

అనంతరం ప్రణీత్ రావు కేసు విచారణ అధికారిగా జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఏసీపీని ఉన్నతాధికారులు నియమించారు. ఆయనను పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ప్రత్యేక పోలీస్ టీం, ప్రణీత్ రావును రిమాండ్ తరలించనున్నట్లు సమాచారం. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రతిపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు.

ఈ కేసులో పంజాగుట్ట పీఎస్​లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆధారాలు దొరక్కుండా పక్కా ప్లాన్‌‌‌‌తో ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌లో హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రణీత్‌‌‌‌రావు లీలలు బయటపడటంతో చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు.. ఈ కేసును సీరియస్ గా తీసుకొన్న ప్రభుత్వం అధికారులకు కీలక సూచనలు జారీచేసినట్లు సమాచారం..

దీంతో ప్రణీత్‌‌‌‌రావు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్​రావును హైదరాబాద్​కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వాంగ్మూలం నమోదు చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది..

You may also like

Leave a Comment