ఏపీలో త్వరలో ఎన్నికలున్న వేళ.. పొలిటికల్ హిట్ పెరుగుంది. ఆ టెంపరేచర్ కాస్త రోజు రోజుకి మంటపెడుతోంది. ఈ నేపథ్యంలో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది.. తరచుగా మాటలతో విమర్శలకు దిగడం కనిపిస్తుంది. ఈ క్రమంలో మరోసారి పవన్‌పై ముద్రగడ పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు..
హైదరాబాద్ (Hyderabad)లో పుట్టిన పవన్.. ఆ రాష్ట్రం వేరు.. మన రాష్ట్రం వేరు అని మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసిన ముద్రగడ.. హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. నగరంలో అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయని నిలదీశారు.. ఇలాంటి నిజాలు మాట్లాడితే ఆయనకు కోపం వస్తుందని విమర్శించారు..
అదీగాక పవన్ కల్యాణ్ మగాడు అయితే డైరెక్ట్ గా నా మీద మాట్లాడాలని సవాల్ చేశారు.. నేను ఏమైనా మాట్లాడితే.. సినిమాల్లో ఉండే సైడ్ క్యారెక్టర్లతో తిట్టిస్తారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. నాపై తెరచాటుగా మాట్లాడడం కాదు.. ప్రెస్‌మీట్ పెట్టండి.. సూటిగా మాట్లాడండి.. ప్రశ్నలు వేయండి.. సమాధానం చెబుతా.. అలాగే నేను వేసిన ప్రశ్నలకు సైతం దమ్ముంటే సమాధానాలు తెలుపాలని డిమాండ్ చేశారు..
ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తిపై నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదని సూచించిన ముద్రగడ.. మాట్లాడే ముందు ఆలోచించి విమర్శించాలని సూచించారు.. అలాగే ఎన్నికల్లో కోట్లు, లక్షలు ఖర్చు చేస్తారని మాట్లాడుతున్న పవన్.. ప్రజలు అంతా అమ్ముడు పోతారనే కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.. క్లారిటీ లేని రాజకీయాలు చేస్తున్న ఆయన ఏం ఆశించి పొత్తులు ఏర్పరచుకొన్నారో తెలియచేయాలని అన్నారు..