నాగార్జున (Nagarjuna) నటించిన, నా సామిరంగ (Naa Saami Ranga) మూవీ సంక్రాంతి సందర్భంగా.. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. పండుగకు పర్ఫెక్ట్ మూవీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వస్తున్నాయి.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మాల్దీవులకు తాను టికెట్లను బుక్ చేసుకొని క్యాన్సిల్ చేశానని తెలిపారు.
బిగ్ బాస్ షో, నా సామిరంగ షూటింగ్ కోసం 75 రోజుల పాటు విశ్రాంతి లేకుండా పని చేశానని వెల్లడించిన నాగార్జున.. మూవీ రిలీజ్ తర్వాత రిలాక్స్ అవుదామని భావించి.. 17వ తేదీన మాల్దీవులకు వెళ్లాలని టికెట్లు బుక్ చేసినట్లు తెలిపారు. కానీ ఈ మధ్య టికెట్లు క్యాన్సల్ చేశానని పేర్కొన్నారు, గతంలో నేను చాలాసార్లు మాల్దీవులకు వెళ్లానని, ఈ ప్లేస్ చాలా బ్యూటీఫుల్ గా ఉంటుందని అన్నారు..
అయితే ఈ లోపు అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు మన దేశంపై, ప్రధాని మోదీపై అసభ్యకరంగా మాట్లాడంతో మాల్దీవులపై వివాదం రాజుకొంది. ఇండియాలో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమైంది. అదే సమయంలో చాలా మంది సెలబ్రిటీలు, సాధారణ పౌరులు ఘాటుగా స్పందించడంతో సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్( Boycott Maldives) నినాదం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
అదేవిధంగా మాల్దీవ్స్‌కు బదులు లక్ష్యద్వీప్ (Lakshadweep)కు వెళ్లాలని ప్రధాని కూడా కోరడంతో చాలా మంది ఫోకస్ లక్ష్యద్వీప్ వైపు మళ్ళింది. దీంతో నాగార్జున సైతం తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకొన్నట్టు వెల్లడించారు.. మాల్దివ్స్ ప్రభుత్వ తీరు ఏమాత్రం సహించదగినది కాదని మన ప్రధానిపై వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ప్రస్తుతం నాగార్జున కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..