Telugu News » Nalgonda : నాగార్జునసాగర్ ఫారెస్ట్‌లో అగ్నిప్రమాదం.. ఆరు ఎకరాలకు వ్యాపించిన మంటలు..!

Nalgonda : నాగార్జునసాగర్ ఫారెస్ట్‌లో అగ్నిప్రమాదం.. ఆరు ఎకరాలకు వ్యాపించిన మంటలు..!

నాగార్జునసాగర్ కోర్ ఫారెస్ట్‌, మూలతండా, సమీపంలో మంటలు చెలరేగాయి. ఆదివారం రాత్రి సమయంలో ఫారెస్ట్‌లోని గుట్టపైన మంటలు మొదలైయ్యాయని తెలుస్తోంది.

by Venu
Fire Accident: Fire in wood mill.. Heavy property damage..!

వేసవిలో మండే ఎండలకు అగ్నిప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా అడవులు అకారణంగా కాలిపోవడం కనిపిస్తోంది. ఇప్పటికే వేసవి పూర్తిగా ఎంటర్ కాకముందే.. ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో అడవులలో అగ్నిప్రమాదాలు జరగడం తరచుగా కనిపిస్తోంది.. తాజాగా నల్లగొండ (Nalgonda) జిల్లా అమ్రాబాద్ (Amrabad) టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (Tiger Reserve Forest)లో మంటలు చెలరేగాయి..

నాగార్జునసాగర్ కోర్ ఫారెస్ట్‌, మూలతండా, సమీపంలో మంటలు చెలరేగాయి. ఆదివారం రాత్రి సమయంలో ఫారెస్ట్‌లోని గుట్టపైన మంటలు మొదలైయ్యాయని తెలుస్తోంది. చిన్నగా అంటుకొన్న నిప్పు, క్రమేణా పెద్దివి కావడంతో స్థానిక తండావాసులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ సిబ్బంది వచ్చే సరికి సుమారు ఆరు ఎకరాల్లోని అడవికి మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలో నివసిస్తున్న తండావాసులు భయాందోళనకు గురయ్యారు.

మరోవైపు స్థానిక ఫారెస్ట్‌ సిబ్బంది.. మంటలు వ్యాపించిన ప్రాంతానికి వెళ్లి ఫైర్‌బ్లోయర్ల సహాయంతో వాటిని ఆర్పారు. కిలోమీటరు మేరమంటలు అంటుకోవడంతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్ర ఇబ్బంది కలిగినట్లు తెలిపారు.. కాగా ఈ అగ్నిప్రమాదానికి కారణం.. నాగార్జునపేట ప్రాంతం రైతులు పత్తికట్టెతో పాటు చెలకలలో ఉన్న చెత్తచెదారాలను తగుల బెట్టి వాటిని ఆర్పకుండానే వెళ్ళినట్లు తెలుస్తోంది.. ఆసమయంలో వీచిన గాలికి సమీపంలోగల అటవీ ప్రాంతం అంటుకొందని తెలుస్తోంది.

You may also like

Leave a Comment