Telugu News » Navdeep: పవన్ కల్యాణ్‌కు మద్దతుగా టాలీవుడ్ హీరో ప్రచారం..!!

Navdeep: పవన్ కల్యాణ్‌కు మద్దతుగా టాలీవుడ్ హీరో ప్రచారం..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు మద్దతుగా సినీ ఇండస్ట్రీలో పలువురు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నవదీప్(Hero Navdeep) పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు.

by Mano
Navdeep: Tollywood hero campaign in support of Pawan Kalyan..!!

ఏపీ(AP)లో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ(BJP-TDP)తో జ‌త‌క‌ట్టిన జ‌న‌సేన‌ 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు మద్దతుగా సినీ ఇండస్ట్రీలో పలువురు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నవదీప్(Hero Navdeep) పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు.

Navdeep: Tollywood hero campaign in support of Pawan Kalyan..!!

పిఠాపురంలోని శ్రీపాద వ‌ల్ల‌భ మ‌హాసంస్థానాన్ని నవదీప్ బుధ‌వారం సంద‌ర్శించాడు. ఈ హీరో తాజా చిత్రం ‘ల‌వ్ మౌళి’. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా శ్రీపాద‌వ‌ల్ల‌భుడి ఆల‌యంలో మూవీ టీమ్ ప్ర‌త్యేక పూజ‌లు చేసింది.  ఈ సంద‌ర్భంగా న‌వ‌దీప్ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయతీగా ఎవ‌రు పోటీ చేసినా ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని, ప‌వ‌న్‌కు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నాడు.

ల‌వ్ మౌళి సినిమా ట్రైల‌ర్ విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, హైద‌రాబాద్‌, కాకినాడ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నట్లు తెలిపారు. ఓ భిన్న‌మైన ప్రేమక‌థ‌తో వ‌స్తున్న ఈ మూవీలో న‌వ‌దీప్ స‌ర‌స‌న గిద్వానీ, భావ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ తెలుసుకునేందుకు ప‌ర్య‌టిస్తున్నామన్నారు. కొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌న్నారు.

ఇదిలా ఉండగా జ‌న‌సేన పార్టీ నుంచి బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు ప‌వ‌న్ ఇటీవ‌ల‌ స్టార్‌ క్యాంపెయిన‌ర్ల‌ను ప్ర‌క‌టించారు. ఈ జాబితాలో నాగబాబు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డాన్స్ మాస్ట‌ర్‌ జానీ మాస్టర్, సినిమా హీరో సాగర్, పృథ్విరాజ్, జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు హైపర్ ఆది, గెటప్ శ్రీను ఉన్నారు.  తాజాగా నవదీప్ తానూ ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు.

You may also like

Leave a Comment