బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ (Nitish Kumar) తొమ్మిదవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా నితీశ్ కుమార్తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ (Rajendra Arlekar) ప్రమాణం చేయించారు. రాజ్ భవన్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు.
ఆయనతో పాటు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బిహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి హాజరయ్యారు. నితీశ్ కుమార్తో పాటు డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు ప్రమాణం చేశారు. మొత్తం 8 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి ప్రేమ్ కుమార్, జేడీయూ నుంచి విజేంద్ర యాదవ్, విజయ్ చౌదరి, శ్రావణ్ కుమార్, హిందుస్తానీ అవామీ మోర్చ నుంచి సంతోష్ సుమన్, స్వతంత్ర అభ్యర్థి సుమిత్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
బిజేపీ లెజిస్లేటరీ పార్టీ నేతగా సామ్రాట్ చౌదరి, ఉపనేతగా విజయ్ సిన్హాలను ఎన్నుకున్నట్టు బీజేపీ జాతీయ కార్యదర్శిగా వినోద్ తవాడే వెల్లడించారు. నితీశ్ కుమార్ మొదట 2000 మార్చిలో మొదటి సారి సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత 2005 నవంబర్ లో రెండవ సారి, 2010 నవంబర్ లో మూడవ సారి, 2015 పిబ్రవరిలో నాల్గవ సారి ప్రమాణం చేశారు.
2015 ఫిబ్రవరిలో ఆరవసారి, 2017 జూలైలో ఆరవసారి, 2020 నవంబర్ లో ఏడవసారి, 2022 అగస్టులో 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా తొమ్మిదవ సారి ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. మరోవైపు ఇండియా కూటమి నుంచి వెైదొలిగినందుకు నితీశ్ కుమార్ పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.