Telugu News » Nizamabad : అనారోగ్యాలకు నిలయంగా పేద విద్యార్థుల హాస్టళ్లు.. కుళ్లిన కూరగాయలతో భోజనం..!

Nizamabad : అనారోగ్యాలకు నిలయంగా పేద విద్యార్థుల హాస్టళ్లు.. కుళ్లిన కూరగాయలతో భోజనం..!

కుళ్లిన కూరగాయలను పడవేయకుండా.. వాటితో వంట చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హాస్టల్ విద్యార్థులు.. తమకు అనారోగ్యాలు కలిగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు..

by Venu

భావితరాల భవిష్యత్తు ప్రస్తుత సమాజంలో ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. వైద్యం, విద్యా ఈ రెండు మనిషిగా పుట్టిన వారికి తప్పక అవసరం ఉన్నా.. ఈ విషయంలో ప్రభుత్వాలు సరైన దిశగా పునాది వేయడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. అధికారంలోకి వచ్చిన వారు కోట్లకు పడగలెత్తుతున్నారు.. అయిన పేద విద్యార్థుల బ్రతుకుల్లో మార్పు కలగడం లేదని ఘోషిస్తున్నారు..

తాజాగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో దారుణమైన ఘటన చోటు చేసుకొంది. కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు (Students) ఆందోళనకు దిగారు. రోడ్డుపై వాటిని పారబోసి నిరసన తెలిపారు. నాందేవ్ వాడ (Nandev Vada)లో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లోని విద్యార్థులు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

కుళ్లిన కూరగాయలను పడవేయకుండా.. వాటితో వంట చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హాస్టల్ విద్యార్థులు.. తమకు అనారోగ్యాలు కలిగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.. తమ గోడు గురించి అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.. ఇలాంటి భోజనం మనిషన్న వారు ఎవరైనా తింటారా? అని ప్రశ్నించారు.

మరోవైపు విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా ఈ సమాచారం అందుకొన్న పోలీసులు (Police) సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆందోళన విరమింజేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.. ఇక ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

You may also like

Leave a Comment