డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కువగా ఖర్చు చేయకూడదు. ఎప్పుడూ కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా పొదుపుగానే ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఖర్చు చేసుకుని డబ్బును పొదుపుగా వాడుకునే అలవాటు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. తెలుగు రాష్ట్రానికి సీఎం అయిన టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన రామారావు డబ్బు విషయంలో ఎప్పుడూ పొరపాటు చేయలేదు కరెక్ట్ గా ఉండేవారు. పాలు అమ్మి చాలా కష్టపడే స్టార్ హీరోగా ఎదిగారు. ఎలాంటి గర్వం కూడా లేకుండా ఎంతో క్రమశిక్షణతో ఆయన నడుచుకునే వారు.
డబ్బు విషయంలో ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఈ విషయాన్ని నిర్మాత నటుడు మురళి మోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ తన తోటి నటులతో పోల్చుకుంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు. ఒకవేళ ఎక్కువ ఇస్తాం అన్నా కూడా నా రెమ్యునరేషన్ ఇంతే బ్రదర్ అని చెప్పేవారు. ఒకరోజు ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు టాలీవుడ్ లో కొందరు ఆయన్ని కలవడానికి వెళ్లారు. కడుపునిండా భోజనం చేశారు తర్వాత ఎన్టీఆర్ ఐస్ క్రీమ్ తిందామా బ్రదర్ అని అడిగారు.
Also read:
సరే అని చెప్పడంతో ఒక పిల్లాడిని పిలిచి ఐస్క్రీమ్ లకి ఎంత డబ్బు అవుతుందో చిల్లర లెక్క పెట్టి ఇచ్చారు. 100 ఇస్తే చిల్లర తిరిగి తెస్తాడు కదా అని ఎవరో అంటే ఎన్టీఆర్ ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని ఆయన చెప్పారు. బాలయ్య పుట్టినప్పుడే కోటీశ్వరుడు అని వరద సహాయం కోసం బాలయ్య దగ్గరికి వెళ్తే వెంటనే లక్ష లేదంటే రెండు లక్షలు ఇస్తాడని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారని తెలిపారు. ఎన్టీఆర్ బాలయ్య ఖర్చుల విషయంలో ఆశ్చర్యపోయారని మురళీమోహన్ అన్నారు.