సీనియర్ ఎన్టీఆర్ గురించి, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోలేదు. ఒకప్పుడు సినిమా పోస్టర్లలో ఎన్టీఆర్ ని చూసి సినిమా థియేటర్లకి వెళ్లి క్యూ కట్టేవారు. చాలామంది ఎన్టీఆర్ ని వాళ్ళ, కుటుంబ సభ్యుల లాగ భావించేవారు. ఎంతో ఆప్యాయంగా ఆయనని పిలిచేవారు కూడా. పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ పెట్టింది పేరు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అనేక వార్తలు సంచలనంగా మారుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారింది.
అప్పుడప్పుడు సీనియర్ నటులకు సంబంధించిన విషయాలు, సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. వాటిని ఫాన్స్ నచ్చితే విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు కూడా. ఎన్టీఆర్ కి తెలుగు భాష మీద పట్టు ఎంత ఉందో ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. అందరం ఆ విషయాన్ని చూశాం. చదువులో కూడా ఎన్టీఆర్ ముందే ఉండేవారు. 1100 మంది రాసిన మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలో ఎన్టీఆర్ ఏడవ ర్యాంక్ ని సాధించారు.
మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగాన్ని కూడా ఎన్టీఆర్ పొందారు. చిత్రలేఖనంలో కూడా రాష్ట్రస్థాయి బహుమతులని అందుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్ చేతిరాతకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ నటనలాగే ఆయన అక్షరాలు కూడా అద్భుతంగా ఉన్నాయి.
Also read:
పైగా తప్పులు కూడా లేవు. ఒక రచయిత రాసినట్లుగా ఆయన రాశారు. ఇందులో ఆయన రాసిన వ్యాఖ్యానాలు, వివరణలు, విజయచిత్ర అనే పత్రిక ద్వారా పాఠకులకు ఆయన రాసిన ఈ లేఖ ని మొత్తం మూడు పేజీలు లో రాసారు. ఇది షూటింగ్ మధ్యలో విరామంలో రాశారట. మరి ఆ మూడు పేజీలో లేఖ ని మీరు కూడా చూసేయండి.