జన్మనిచ్చిన తల్లి పట్ల ఓ యువకుడు క్రూరంగా ప్రవర్తించాడు. పొలం నుంచి కాలీఫ్లవర్ తెంపిందని మానవత్వం మరచిన కుమారుడు, తన తల్లిని స్తంభానికి కట్టేసి, తీవ్రంగా చితకబాదాడు. ఈ దారుణ ఘటన ఒడిశా (Odisha)లోని కియోంఝార్ (Keonjhar) జిల్లాలో చోటు చేసుకోంది..
కియోంఝార్ జిల్లా సరసపాసి గ్రామంలో ఓ 70 ఏండ్ల వృద్ధురాలు కుమారులకి దూరంగా.. ఒంటరిగా నివసిస్తోంది. అయితే వంటకోసమని, తనకి దగ్గరలో ఉన్న చిన్న కుమారుడి పొలంలో నుంచి.. కాలీఫ్లవర్ (Cauliflower)ను తెంపింది. ఈ విషయం గమనించిన చిన్న కుమారుడు.. తన అనుమతి లేకుండా కాలీఫ్లవర్ ఎందుకు తెంపావని తల్లిని నిలదీశాడు. ఆవేశంతో ఆగకుండా వృద్ధురాలు అయిన తల్లిని (Mother) స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు..
ఈ ఘాతుకాన్ని చూస్తున్న స్థానికులు అడ్డుకోవడానికి వెళ్ళితే.. వారిని సైతం బెదిరించినట్టు సమాచారం.. చివరికి తిరగబడిన స్థానికులు.. గాయపడ్డ వృద్ధురాలిని ప్రాణాలతో రక్షించారు. అనంతరం బాధితురాలిని చికిత్స కోసం బసుదేవ్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు.
బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిపై కేసు నమోదు చేసుకొన్నారు.. తల్లిని ప్రేమగా చూడకపోయిన ఫర్వాలేదు.. ఇలా కొట్టడం చాలా దారుణమని ఈ విషయం తెలిసిన వారు.. వృద్ధురాలి కుమారునిపై దుమ్మెత్తిపోస్తున్నారు..