Telugu News » Oscars 2024: ఆస్కార్‌-2024 విజేతలు వీరే.. ఆ సినిమాకు పట్టం..!

Oscars 2024: ఆస్కార్‌-2024 విజేతలు వీరే.. ఆ సినిమాకు పట్టం..!

ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డ్స్ -2024 ను అకాడమి ప్రకటించింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్(Oppenheimer) అవార్డులను కొల్లగొట్టింది.

by Mano
Oscars 2024: These are the winners of Oscar-2024.

ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డ్స్ -2024(Oscars-2024) ప్రదాన కార్యక్రమం అమెరికా(USA)లోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌(Los Angeles Dolby Theatre) వేదికగా ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్(Oppenheimer) అవార్డులను కొల్లగొట్టింది.

Oscars 2024: These are the winners of Oscar-2024.

ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా డైరెక్టర్‌కు ఉత్తమ దర్శకుడిగా, ప్రధాన పాత్రలో నటించిన సిలియన్ మర్ఫీకి ఉత్తమ నటుడిగా అవార్డుల పంట పండించింది. మరిన్ని కేటగిరీలలోనూ ఈ సినిమా అవార్డులను దక్కించుకుంది. గతేడాది ‘‘ఆర్ఆర్ఆర్’’సాంగ్‌కు ఆస్కార్‌ బరిలో అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం తెలుగు సినిమాలకు ఆస్కార్ అవార్డుల్లో చోటు దక్కలేదు.

మేజర్ కేటగిరీల్లో ఓపెన్ హైమర్ సినిమా అవార్డులను ఎగరేసుకుపోయింది. మొత్తం 13 కేటగిరీల్లో పోటికి నిలిచిన ఈ సినిమాకు చాలా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ సపోర్టింగ్ రోల్‌, బెస్ట్ ఎడిటింగ్‌, బెస్ట్ సినిమాటోగ్రఫి లాంటి కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులు సాధించింది. భారత్ నుంచి డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో అవార్డు బరిలో నిలిచిన ‘టు కిల్‌ ఏ టైగర్‌’కు నిరాశే మిగిలింది. మెయిన్ కేటగిరీస్‌కు సంబంధించిన అవార్డులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఇప్పటి వరకు ప్రకటించిన ఆస్కార్ అవార్డుల జాబితా

ఉత్తమ చిత్రం – ఓపెన్‌హైమర్
ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింక్స్)
ఉత్తమ సహాయ నటి: డా’వైన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫెర్సన్ (అమెరికన్ ఫిక్షన్)
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యూకే)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ది బాయ్ అండ్ ది హెరాన్
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్ (బార్బీలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? సాంగ్‌కి)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: 20 డేస్ ఇన్ మారియుపోల్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: ది లాస్ట్ రిపేర్ షాప్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: వార్ ఈజ్ ఓవర్!
బెస్ట్ హెయిర్ అండ్ మేకప్: పూర్ థింగ్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్
బెస్ట్ సౌండ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్‌హైమర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పూర్ థింగ్స్

You may also like

Leave a Comment